https://oktelugu.com/

Bhola Shankar First Look: భోళా లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్ !

Bhola Shankar First Look: టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మహాశివరాత్రి కానుక వచ్చేసింది. భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్‌పై కూర్చుని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక మెగాస్టార్ […]

Written By: , Updated On : March 1, 2022 / 10:50 AM IST
Follow us on

Bhola Shankar First Look: టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మహాశివరాత్రి కానుక వచ్చేసింది. భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్‌పై కూర్చుని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.

Bhola Shankar First Look

Bhola Shankar First Look

ఇక మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిరు గుండు లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ లుక్ ఈ సినిమాలోదే. అలాగే ఈ సినిమాలో మరో క్రేజీ లుక్ కూడా ఉందట. ఆ లుక్ పూర్తీ డిఫరెంట్ గా ఉంటుందట. మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. పైగా మెగాస్టార్ కి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చింది.

Bhola Shankar First Look

Megastar Bhola Shankar First Look

Also Read: స్పెషల్ పోస్టర్‌ తో రాబోతున్న మహేష్ బాబు !

ముఖ్యంగా కథలోని మెయిన్ ఎమోషన్స్ అద్భుతంగా వచ్చాయట. ఎలాగూ మెహర్ రమేష్ లో మంచి షార్ప్ డైరెక్టర్ ఉన్నాడు. హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి ఉన్న టాలెంట్ అతి తక్కువ మంది డైరెక్టర్లకి మాత్రమే ఉంది. కానీ, వరుస ప్లాప్ ల దెబ్బకు మెహర్ రమేష్ సినిమా లేక దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మరీ ఈ గ్యాప్ లో మెహర్ రమేష్ ఎలాంటి హార్డ్ వర్క్ చేసాడో.. తనను తానూ ఎలా అప్ డేట్ చేసుకున్నాడో చూడాలి.

మెగాస్టార్ మాత్రం పెద్ద మనసుతో మెహర్ రమేష్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మరి మెహర్ రమేష్, మెగాస్టార్ కి పెద్ద క‌మ‌ర్శియ సక్సెస్ ఇచ్చి, తనకు ఉన్న ప్లాప్ డైరెక్టర్ ట్యాగ్ ను పోగొట్టుకుంటాడేమో చూద్దాం. మెగాస్టార్ లుక్ అయితే అదిరిపోయింది. ఒక డైరెక్టర్ గా మెహర్ రమేష్ లో గొప్ప టాలెంట్ ఉంది. షార్ప్ కటింగ్ షాట్ మేకింగ్ లో మెహర్ రమేష్ దిట్ట. ఈ లుక్ తో ఆ విషయం మరోసారి రుజువు అయింది.

Also Read: సుఖ ప్ర‌స‌వం కోసం కాజల్ స్పెషల్ వర్కౌట్స్

Recommended Video:

Bheemla Nayak 5th Day Total Collections | Bheemla Nayak Sensational Box Office Collections

Tags