https://oktelugu.com/

Godfather First Look Released: మెగా లుక్ అదిరింది.. మెగా ఫ్యాన్స్ కు ఇక పునకాలే !

Godfather First Look Released: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. స్పోర్ట్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించారు. ముఖ్యంగా స్టైల్ గా కుర్చీలో కూర్చొని, నలుపు షేడ్స్ లో కనిపించిన చిరు గెటప్ అండ్ సెటప్ వెరీ పవర్ ఫుల్ గా ఉంది. ఒక్క మాటలో చిరంజీవి […]

Written By:
  • Shiva
  • , Updated On : July 4, 2022 / 08:22 PM IST
    Follow us on

    Godfather First Look Released: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. స్పోర్ట్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించారు. ముఖ్యంగా స్టైల్ గా కుర్చీలో కూర్చొని, నలుపు షేడ్స్ లో కనిపించిన చిరు గెటప్ అండ్ సెటప్ వెరీ పవర్ ఫుల్ గా ఉంది. ఒక్క మాటలో చిరంజీవి పాత్రకు సంబందించిన ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ అద్భుతంగా ఉంది.

    Megastar Chiranjeevi

    కార్యాలయం బయట వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురచూస్తున్న క్షణాన.. అంబాసిడర్ కారులో నుంచి చిరు ఫుల్ మాస్ అండ్ సీరియస్ లుక్ లో దిగడం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక చిరు పాత్రకి థమన్ అద్భుతమైన BGM ఇచ్చా డు. ఈ పోస్టర్ తో ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ ఫుల్ యాక్షన్ తో దిగినట్టు అనిపించింది.

    Also Read: Ashu Reddy: అషురెడ్డి సీక్రెట్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ టాటూ వేసుకుందా?

    ఇక ఈ గాడ్ ఫాదర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ ప్లాష్ బ్యాక్ లో స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడట. పైగా ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. మెగాస్టార్ కి, మెగాస్టార్ తండ్రి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అంటే సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నాడు అన్నమాట. ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది.

    Megastar Chiranjeevi

    నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే చిరు లుక్స్ ను పూర్తిగా మార్చారు. పై లుక్ తో పాటు.. చిరు మరో లుక్ లో కూడా కనిపించనున్నారు. పంచె కట్టుతో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చిరు పక్కా క్లాసిక్ మాస్ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే, పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తుండగా.. నిరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

    Also Read:Bunny Vasu- Rashmika Mandanna: అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు బతిమిలాడుతున్నాడు

    Tags