https://oktelugu.com/

Ashu Reddy: అషురెడ్డి సీక్రెట్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ టాటూ వేసుకుందా?

Ashu Reddy: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. అభిమానం తలకెక్కితే అంతే. ఎన్నో రకాల అభిమానులుంటారు. కొందరు టాటూ వేసుకుంటారు. ఇంకొందరు పచ్చబొట్టు పొడిపించుకుంటారు. కొందరైతే ఏకంగా గుడి కట్టిస్తారు. తమిళనాడులో కుష్బూకు అభిమానులు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తున్న నేపథ్యంలో పలువురు తమ టాలెంట్ చూపించుకునేందుకు సామాజిక మాధ్యమాలనే ఎరగా ఎంచుకుంటున్నారు. దీంతో అందులో తమకు ఇష్టమైన వారి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడటం లేదు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 4, 2022 / 08:16 PM IST
    Follow us on

    Ashu Reddy: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. అభిమానం తలకెక్కితే అంతే. ఎన్నో రకాల అభిమానులుంటారు. కొందరు టాటూ వేసుకుంటారు. ఇంకొందరు పచ్చబొట్టు పొడిపించుకుంటారు. కొందరైతే ఏకంగా గుడి కట్టిస్తారు. తమిళనాడులో కుష్బూకు అభిమానులు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తున్న నేపథ్యంలో పలువురు తమ టాలెంట్ చూపించుకునేందుకు సామాజిక మాధ్యమాలనే ఎరగా ఎంచుకుంటున్నారు. దీంతో అందులో తమకు ఇష్టమైన వారి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడటం లేదు. ఫలితంగా నెట్టింట్లో వైరల్ గా మారుతున్నట్లు తెలుస్తోంది.

    Ashu Reddy

    ఈ సందర్భంగా అషురెడ్డి గురించి చెప్పుకోవాల్సిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్లో ప్రముఖంగా వినిపించిన పేరు. ఆమె తన అందంతో మైమరపిస్తోంది. ఆమెకు పవన్ కల్యాణ్ అంటే పిచ్చి ప్రేమ. అందుకే ఆమె పవన్ కల్యాణ్ పేరును టాటూ వేసుకుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ లో అషురెడ్డి సత్తా చాటింది. ఆయనపై ఉన్న అభిమానంతో ఎదపై పవన్ కల్యాణ్ టాటూ వేసుకోవడం సంచలనం కలిగిస్తోంది.

    Also Read: Rashmika Mandanna: స్పెషల్ సాంగ్ కి సై.. విజయ్ దేవరకొండ కోసమేనా ?

    పవన్ కల్యాణ్ పేరు టాటూ వేసుకున్న దాన్ని చూపిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా హల్ చల్ చేస్తోంది. టాటూ తో దిగిన ఫొటోలను చూపిస్తూ నెట్టింట్లో సందడి చేస్తోంది. అషురెడ్డి వేయించుకున్న టాటూ హల్ చల్ చేస్తోంది. అభిమానులతో పంచుకుంది. ఆమె ఫొటోలు కూడా నెట్టింట దర్శనమిస్తూ అభిమానులతో తన అనుభవాలు పంచుకుంటోంది. పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతోనే టాటూ వేసుకుని తన ఇష్టాన్ని చాటుతోంది.

    Ashu Reddy

    అషురెడ్డి పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆమె కమెడియన్ హరితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు రాహుల్ తో కూడా ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అషురెడ్డి భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నగానే మిగులుతోంది. దీంతో అషురెడ్డి మాత్రం సోషల్ మీడియాలోనే బిజీగా ఉంటోంది. బిగ్ బాస్ తో తన పేరు మారుమోగింది. తరువాత మాత్రం ఆమె సామాజిక మాధ్యమాల్లోనే కాలం గడుపుతోంది. అషురెడ్డి వేసుకున్న టాటూతోనే తనకు ప్రాధాన్యం వచ్చినట్లు చెబుతున్నారు.

    Also Read:Pawan Kalyan Chiranjeevi: చిరంజీవినే సీఎం.. పవన్ ఒప్పుకుంటారా? బీజేపీ స్కెచ్ ఏంటి?

    Tags