Meghastar Chiranjeevi : విజయవాడ లో బుడమేరు వాగు ఉప్పొంగి, ఏ స్థాయిలో వరద బీభత్సం ని సృష్టించిందో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. విజయవాడ మొత్తం మునిగిపోయింది, ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయాయి, చరిత్రలో ఎప్పుడూ నమోదు అవ్వని స్థాయిలో వర్షపాతం విజయవాడలో నమోదు అవ్వడంతో సహాయ కార్యక్రమాలు చేసేందుకు కూడా ప్రభుత్వానికి చాలా కష్టతరమైంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ సహాయ సహకారాలతో ఈ విపత్తు నుండి తొందరగా కోలుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈ కష్టసమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ విజయవాడ ప్రజలకు అండగా నిలిచారు.
భారీ స్థాయిలో విరాళాలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయిలు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నిన్న హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం లో కలిసి కోటి రూపాయిల చెక్ ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ వేస్తూ ‘విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయిలు అందించిన చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. కష్ట సమయం వచ్చినప్పుడల్లా అందరికంటే ముందు సహాయం చేయడంలో చిరంజీవి గారు ముందు ఉంటారు. వరదల వల్ల నష్టపోయిన అమాయకుల జీవితాలను పునర్నిర్మించడంలో చిరంజీవి గారు అందించిన ఈ విరాళం ముఖ్య పాత్రను పోషిస్తుంది.’ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ వేసాడు. దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ‘ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. ఆదర్శప్రాయమైన మీ నాయకత్వం లో ప్రక్రుతి ద్వారా సంభవించిన ఈ విపత్తకరమైన సమయంలో ప్రజల కోసం సహాయం అందించడం మా కర్తవ్యం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం చిరంజీవి, రామ్ చరణ్ మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ కి చెందిన హీరోలందరూ తమ వంతు సహాయ సహకారాలను ఈ వరద సమయంలో అందించారు. కేవలం మెగా ఫ్యామిలీ నుండే 10 కోట్ల రూపాయిల విరాళం అందడం అనేది చిన్న విషయం కాదు. ఇందులో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి స్థానం లో ఉన్నప్పటికీ కూడా 6 కోట్ల రూపాయిల విరాళం అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో కూడా మెగా ఫ్యామిలీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. చిరంజీవి, రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతీ విపత్కర సమయంలో ఆపన్న హస్తం అందిస్తూ అభిమానులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది మెగా ఫ్యామిలీ.
దసరా స్పెషల్…. మెగాస్టార్ చిరంజీవి గారు CM
చంద్రబాబు గారిని కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు…. pic.twitter.com/AsHUzf9Vtj— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) October 12, 2024