Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన విజయాలను, అపజయాలను, కుటుంబ సమస్యలను అన్ని జనాలు చూసారు. ఆయన గురించి తెలియని విశేషాలు ఏమి లేవు. కానీ ఈమధ్య చిరంజీవి గారు అభిమానులకు తెలియని విషయాలను కూడా చెప్పేస్తున్నాడు. అలాంటివి చెప్పడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురు అవుతాయి అనేది కూడా ఆలోచించడం లేదు. చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. గతం లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై తన తాత మంచి రసికుడు, ముగ్గురు నలుగురు భార్యలు ఉన్నారు, వాళ్ళతో గొడవలైనప్పుడు వేరే ఇళ్లకు వెళ్ళేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా లో ట్రోల్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇది ఇలా ఉండగా మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన తల్లి అంజనా దేవి, ఇద్దరు చెల్లెల్లు, నాగబాబు(Nagendra Babu Konidela) తో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
Also Read : కేవలం 4 నెలల్లోనే చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం..? మెగా ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్!
ఈ ఇంటర్వ్యూ లో ఆయన అభిమానులకు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో అమ్మకి ముగ్గురు పిల్లలు పుట్టి పురిటిలోనే చనిపోయారు. ఒక బిడ్డ ఒకటిన్నర సంవత్సరం నిండిన తర్వాత చనిపోయింది. ఆరోజు నేను స్కూల్ లో ఉన్నాను, నాన్న క్యాంప్ మీద బయటకు వెళ్లి ఉన్నాడు. అప్పుడే నా చెల్లి స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయించింది. కానీ స్పృహలోకి రాలేదు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అమ్మ మా నాన్న కి ఆ విషయం తెలియచేయలేదు. బాధని దిగమింగుకొని దాచుకుంది. ఆమె వయస్సు కూడా అప్పట్లో చాలా చిన్నది. ఆ పరిస్థితులు తల్చుకుంటే ఇప్పటికీ ఏడుపు వచ్చేస్తుంది’ అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా అమ్మ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో, ఆమె వల్ల ఏర్పడిన ఈ వంశ వృక్షం ఎక్కడికో వెళ్ళిపోయింది. మా ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానం ని చూస్తున్నారు. ఇలాంటి అదృష్టం బహుశా సురేఖ కి , నా చెల్లెల్లు కూడా రాదేమో’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సుమారుగా 30 నిమిషాల నిడివితో ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మినహా, అంజనమ్మ సంతానం మొత్తం ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా విషయానికి వస్తే, విశ్వంభర చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమాకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.
Also Read : చిరంజీవి ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నాడా..? ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?