Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఆయన నుండి ఒక్క సినిమా విడుదల కోసం ఎప్పటి నుండో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘ఓజీ'(They Call Him OG) చిత్రాలు 70 శాతం కి పైగా షూటింగ్ ఏడాది క్రితమే పూర్తి చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఈ రెండు సినిమాలకు ఆ సమయంలో డేట్స్ కేటాయించలేకపోయాడు. కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా డేట్స్ కేటాయిస్తాడేమో అని అనుకుంటే, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన ఇంకా బిజీ గా మారిపోయాడు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ‘హరి హర వీరమల్లు’ కి పది రోజుల డేట్స్ ని కేటాయించాడు, ఇంకో వారం రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది. కానీ ఆయన పొలిటికల్ బిజీ వల్ల మళ్ళీ బ్రేక్ పడింది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ చిత్రం సూపర్ హిట్ అవ్వాలంటే ఇన్ని వందల కోట్లు రాబట్టాలా..? సాధ్యం అయ్యే పనేనా!
ఈలోపు మేకర్స్ పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రం లో ఔరంగజేబు క్యారక్టర్ చేస్తున్న బాబీ డియోల్ మీద వారం రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్నేహితులుగా నటిస్తున్న సునీల్, సుబ్బరాజు తదితరులపై మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అదే విధంగా రీసెంట్ గానే రాజస్థాన్ లో 5 రోజుల పాటు కొన్ని షాట్స్ ని చిత్రీకరించారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లో గండికోట లో నాలుగు రోజుల పాటు పలు సన్నివేశాలను తీసి, రీసెంట్ గానే ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లి లో ప్రముఖ నటీనటులు సత్య రాజ్, ఈశ్వరి రావు లపై కొన్ని కీలక సన్నివేశాలను 5 రోజుల పాటు తెరకెక్కించారు. ఇక కేవలం పవన్ కళ్యాణ్, సత్య రాజ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.
ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తే షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టే, ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తారీఖు నుండి ‘హరి హర వీరమల్లు’ కి డేట్స్ ని కేటాయించాడట. రాజకీయాల్లో ఉండడం వల్ల పూర్తిగా షేప్ అవుట్ అయిన పవన్ కళ్యాణ్ గత వారం రోజుల నుండి జిమ్ లో వర్కౌట్స్ కూడా చేస్తున్నాడట. ఇదంత పక్కన పెడితే ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలిసిపోయింది. ఒక పెద్ద షిప్ లో నటుడు మురళి శర్మ వజ్రాలను రవాణా చేస్తుంటాడట. ఈ విషయాన్ని తెలుసుకున్న వీరమల్లు, మురళి శర్మ కి ముందస్తుగానే సమాచారం అందించి, ఆ వజ్రాలను దొంగతనం చేస్తాడట. ఈ ఫైట్ సన్నివేశం మొత్తం ఎంతో అద్భుతంగా వచ్చిందని, ఫ్యాన్స్ కి థియేటర్ లో పూనకాలు రావడం గ్యారంటీ అని అంటున్నారు, చూడాలి మరి.
Also Read ; ఏకంగా 11 సార్లు వాయిదా..టాలీవుడ్ హిస్టరీ లోనే మొదటిసారి..’హరి హర వీరమల్లు’ కి మోక్షం దక్కేది ఎప్పుడంటే!