Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్, సినిమాల్లో నటిస్తూ.. షూటింగ్స్‌లో నిమగ్నమయ్యారు చిరు. ఒక సినిమాను పూర్తి చేసిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతున్నారు చిరు. ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’సినిమాలో నటిస్తున్నారు. కేవలం ఒక సినిమా తర్వాత మరొకటి అని కాకుండా… సినిమా లాంఛింగ్ సమయంలో ప్రీలుక్ విడుదల చేస్తున్నారు. అలా తన కొత్త సినిమాలో గెటప్ ఎలా వుండబోతుందనే విషయంపై ఆడియన్స్ కు క్లారిటీ ఇస్తున్నారు చిరు.

దీంతో రేపు మొదలుకానున్న ‘భోళాశంకర్’ కోసం కూడా ప్రీలుక్ రెడీ అయినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సినిమా కోసం రెండు రోజుల క్రితమే లుక్ టెస్ట్ ను పూర్తి చేశారు చిరంజీవి. ఓ స్పెషల్ లుక్ లో చిరంజీవిపై ఫోటోషూట్ ను నిర్వహించారు. ఆ స్టిల్ ను రేపు విడుదల చేయబోతున్నారు. తన ప్రతి సినిమా విషయంలో చిరు ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దర్శకుడు బాబీతో చేయాల్సిన సినిమా కోసం మాస్ లుక్ లోకి మారారు చిరు.
ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. రీసెంట్ గానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే తమన్నా ఈ సినిమా సెట్స్ పై జాయిన్ కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.