Homeఎంటర్టైన్మెంట్Sonu Sood: ఈ కంటెస్టెంట్ కి సోనూసూద్ అండా దండా

Sonu Sood: ఈ కంటెస్టెంట్ కి సోనూసూద్ అండా దండా

Bigg Boss 5 Telugu: ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ పేర్ల మీద ఫ్యాన్ పేజీ ని క్రియేట్ చేసి తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ సపోర్ట్ ని కూడా తెలియచేస్తారు. ఇప్పటికే మానస్ నాగులపల్లి కి ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన వంతు సపోర్ట్ తెలియచేస్తూ సందీప్ ఒక వీడియో […]

Bigg Boss 5 Telugu: ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ పేర్ల మీద ఫ్యాన్ పేజీ ని క్రియేట్ చేసి తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ సపోర్ట్ ని కూడా తెలియచేస్తారు.

ఇప్పటికే మానస్ నాగులపల్లి కి ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన వంతు సపోర్ట్ తెలియచేస్తూ సందీప్ ఒక వీడియో పెట్టాడు. అయితే ఈ కంటెస్టెంట్ కి ఏకంగా బాలీవుడ్ నుండే సపోర్ట్ లభించింది. ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో కాదు… కరోనా కష్ట సమయం లో పేదల గుండెల్లో దేవుడయ్యి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు సోనూసూద్. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ సింగర్ శ్రీరామ చంద్ర కి సపోర్ట్ గా నిలుస్తూ ఒక వీడియో విడుదల చేసాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సింగర్ శ్రీరామ చంద్ర దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచి ఎందరో అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నాడు. స్వతహాగా సింగర్ అవ్వడం వలన చాలా మంది సింగర్ లు కూడా శ్రీరామ చంద్ర ని సపోర్ట్ చెయ్యండి అంటూ సామజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు పెడుతూ తమ సపోర్ట్ ని తెలియ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరు అవుతారో అన్న విషయం మాత్రం బిగ్ బాస్ చివరి రోజు మాత్రమే తెలుస్తుంది.

 

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.

Related News

Most Popular

Oktelugu Epaper