Homeఎంటర్టైన్మెంట్Mega Star Chiranjeevi: మెగాస్టార్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు.. ఇవి...

Mega Star Chiranjeevi: మెగాస్టార్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు.. ఇవి చిరు కెరీర్ లోనే సంచలన నిజాలు !

Mega Star Chiranjeevi: ‘స్వయంకృషి’తో ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ . అందుకే, మెగాస్టార్ అంటే.. స్టార్ హీరోలకు కూడా ప్రత్యేక ఆకర్షణ, అభిమానం ఉంటుంది. పైగా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కు కొత్త లెక్కలు అద్దిన ఘనత కూడా చిరుకే దక్కుతుంది. పైగా తన స్టెప్స్ తో ఎంతో మంది హీరోలకు పాఠాలు నేర్పిన ‘ఆచార్యు’డు చిరు. ఇక యాక్షన్‌ కు సరికొత్త అర్ధాన్ని వివరించిన ‘గాడ్‌ఫాదర్‌’ చిరు. అలాగే, ఇండస్ట్రీ హిట్లకు కొత్త దారులను చూపించిన ‘హిట్లర్‌’ చిరు. ప్రతి పాత్రని ‘ఛాలెంజ్‌’గా తీసుకొని ‘విజేత’గా నిలిచిన ‘హీరో’ మన మెగాస్టార్.

Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

అన్నిటికీ మించి రక్తదానం, నేత్రదానంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ‘ఆపద్బాంధవుడు’ మన చిరు. అలాగే కరోనా సమయంలో పేద కళాకారుల కడుపు నింపిన ‘మగ మహారాజు’.. మన ‘అందరివాడు’. అందుకే, చిరంజీవి అంటే జనాలకు పిచ్చి. నేడు చిరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో చిన్న చిన్న పాత్రలు వేశారు. అప్పుడు ఆయనకు ఎంతో సాయం చేసిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన దర్శక నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. ఈయన అఫీస్ లోనే చిరు చాలా రోజులు ఉన్నారు.

మెగాస్టార్ కి తన బర్త్‌డే ఆగస్ట్‌ 22న ఎంత ప్రత్యేకమో.. సెప్టెంబర్‌ 22 ను అంతకంటే స్పెషల్‌ గా భావిస్తారు. కారణం.. చిరు నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ ఇదే రోజు విడుదలైంది. కొణిదెల శివశంకర్‌ వరప్రసాద్‌ని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రోజు సెప్టెంబర్‌ 22నే.

Mega Star Chiranjeevi
Chiranjeevi

తాను నటించిన అన్నీ చిత్రాల్లో ఎక్కువగా ఏ చిత్రం ఇష్టమో చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సినిమా పేరే ‘రుద్రవీణ‌’. కారణం ఈ సినిమాలో పాటలు అంటే చిరంజీవికి చాలా బాగా ఇష్టమట. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘న‌మ్మ‌కు నమ్మ‌కు ఈరేయిని క‌మ్ముకు వ‌చ్చిన ఈ మాయ‌ని’అనే పాట చిరుకి బాగా ఇష్టం అట.

ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటో తెలుసా ?, చిరంజీవి చేతి రాత బాగుండ‌ద‌ట‌. అందుకే.. చిరు రాసిన దాన్ని ఆయనే మళ్లీ చదవలేకపోయేవారట. అందుకే.. ఆయన తన సైన్ ను చాలా రోజులు ప్రాక్టీస్ చేశారట.

మెగాస్టార్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అట. అందుకే, వీలు చిక్కినప్పుడల్లా ఆయన ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తూ ఉంటారు.

మెగాస్టార్ ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నాడని మీకు తెలుసా ?. ‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా చిరు వేసుకున్నారు.

ఇక రెండు బిరుదులు పొందిన అరుదైన హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ‘సుప్రీమ్‌ హీరో’గా ఆ తర్వాత ‘మెగాస్టార్‌’గా ఆయన క్రేజ్‌ సంపాదించుకున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper