Ram Charan- Rishab Shetty: కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద ఇటీవల కాలం లో KGF చాప్టర్ 2 తర్వాత అంతతి సంచలన విజయం సాధించిన ఏకైక చిత్రం ‘కాంతారా’..కన్నడ చలన చిత్ర పరిశ్రమ పటిష్ట పెంచిన సినిమాలలో ఒకటి ఈ చిత్రం..విడుదలై 20 రోజులు దాటినా కూడా ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ కొత్త సినిమాలకు కూడా పోటీని ఇస్తుంది..ఇటీవలే ఈ సినిమాని తెలుగు , హిందీ మరియు తమిళం లో దబ్ చేసి వదలగా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు..అయితే ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టి మన టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడట..ఇటీవలే కాంతారా తెలుగు వెర్షన్ రిలీజ్ కి ముందు ప్రొమోషన్స్ లో పాల్గొన్న రిషబ్ శెట్టి రామ్ చరణ్ ని ప్రత్యేకంగా కలిసి సుమారు గంటసేపు భేటీ అయ్యారట.
ఈ భేటీ లో రిషబ్ శెట్టి తన డ్రీం ప్రాజెక్ట్ గా అనుకున్న స్టోరీ ని రామ్ చరణ్ కి వినిపించాడట..రామ్ చరణ్ ఆ కథ విని చాలా థ్రిల్ గురైనట్టు తెలుస్తుంది..మనం కచ్చితంగా సినిమా చేస్తున్నాం..డేట్స్ చూసుకొని పిలుస్తాను,ప్రారంభిద్దాం అని చెప్పాడట..రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..చాలా భాగం వరుకు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది..ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా కమిట్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి లేదని తెలుస్తుంది..ఆ ప్రాజెక్ట్ కి బదులుగా రిషబ్ శెట్టి తో చెయ్యబొయ్యే సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడట రామ్ చరణ్..ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్నట్టు సమాచారం..ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.