Bigg Boss 6 Telugu 7th Week Elimination: బిగ్ బాస్ సీజన్ 6లో గ్లామర్ డోస్ చాలా తక్కువ. చూడగానే నచ్చేసే ఒక్క అందమైన అమ్మాయి హౌస్లో లేదు. గత సీజన్స్ లో కనీసం అరడజను అందమైన అమ్మాయిలు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చేవారు. లేటెస్ట్ సీజన్ లో అమ్మాయిలు ఉన్నప్పటికీ… అందగత్తెలు కాదన్న అభిప్రాయం ఉంది. ఈ విషయంలో ఆడియన్స్ ఒకింత నిరాశకు గురవుతున్నారు. ఉన్నోళ్ళలో శ్రీసత్య కొంచెం బెటర్. అబ్బాయిలు కూడా ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే హౌస్లో ఉన్న ఆ ఒక్క అందమైన కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కానుందట. ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఏడవ వారం అత్యధికంగా 13 మంది నామినేట్ అయ్యారు. ఇనయా, బాల ఆదిత్య, అర్జున్ కళ్యాణ్, ఆదిరెడ్డి, కీర్తి భట్, శ్రీసత్య, రేవంత్, ఫైమా, వాసంతి, మెరీనా, రాజశేఖర్, రోహిత్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఓటింగ్ ప్రకారం ఎవరి స్థానం ఏమిటనే లెక్కలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మెజారిటీ సర్వేల ప్రకారం రేవంత్, బాల ఆదిత్య, ఆదిరెడ్డి టాప్ లో కొనసాగుతున్నారట. ఆడియన్స్ వారికి భారీగా ఓట్లు వేశారట.
నామినేషన్స్ లో ఉన్న ఇంటి సభ్యుల్లో అతి తక్కువ ఓట్లతో మెరీనా, శ్రీసత్య వెనుకబడ్డారట. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. మెరీనా, శ్రీసత్య డేంజర్ జోన్లో ఉన్నారు అంటున్నారు. ఒకవేళ శ్రీసత్య ఎలిమినేటైతే అర్జున్ కళ్యాణ్ ని ఓదార్చడం కష్టం. ఈ మధ్య ఆమె కంటెస్టెంట్ శ్రీహాన్ కి దగ్గరవుతుంది. శ్రీహాన్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అదే సమయంలో మెరీనా సైతం ఎలిమినేట్ కావచ్చు. మొదట్లో మెరీనా-రోహిత్ జంటగా ఆడారు. వాళ్ళను బిగ్ బాస్ విడదీసిన విషయం తెలిసిందే.

శ్రీసత్య వెళ్ళిపోతే హౌస్లో గ్లామర్ డోస్ తగ్గుతుంది. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ని ఈజీగా తీసుకొని కంటెస్టెంట్స్ బిగ్ బాస్ కోపానికి కారణయ్యారు. దీంతో ఇంటి సభ్యులతో ఆయన ఆడుకుంటున్నాడు. ఒక రోజంతా ఫుడ్ లేకుండా చేశారు. పోరాడితే ఆహారం అంటూ గేమ్స్ ఆడించి గెలిచిన వాళ్లకు మాత్రమే ఫుడ్ పెట్టాడు. కంటెస్టెంట్స్ లో కసి పెంచేందుకు బిగ్ బాస్ ఒకరితో మరొకరు తలపడేలా గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు.