Balakrishna- Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీసన్ 2 ఇటీవలే ఘనంగా ప్రారంభై రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి ఎపిసోడ్ కి మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరవ్వగా..రెండవ ఎపిసోడ్ కి సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలతో పాటుగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..వీళ్ళ ముగ్గురితో బాలయ్య బాబు చేసిన చిట్ చాట్ అదిరిపోయింది.

ఆద్యంతం ఫన్ తో సాగిపోయిన ఈ ఎపిసోడ్ లో అభిమానులకు మరియు ప్రేక్షకులకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి..అవి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి..మరి ముఖ్యంగా ఈ చిట్ చాట్ లో బాలయ్య బాబు కి మరియు పవన్ కళ్యాణ్ కి అంత మంచి సాన్నిహిత్యం ఉందా అనే విషయం తెలిసి అభిమానులు సైతం షాక్ కి గురైయ్యారు.
ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య బాబు నాగ వంశి తో మాట్లాడుతూ ‘భీమ్లా నాయక్ మొదట హీరో గా అనుకున్నది ఎవరిని’ అని అడగగా వంశి దానికి సమాధానం చెప్తూ ‘మీరే సార్’ అంటాడు..అప్పుడు బాలయ్య బాబు ‘మరి చివరికి ఏమైంది’ అని అడగగా దానికి నాగ వంశి సమాధానం చెప్తూ ‘మేము మీ వెంటపడి ఈ సినిమా చూడండి..మీరు చేస్తే బాగుంటుందని చెప్తే..మీరు ఆ సినిమా చూసి ఇది నాకంటే పవన్ కళ్యాణ్ కి బాగా సెట్ అవుతుంది అని చెప్పింది మీరే కదా సార్’ అంటూ సమాధానం ఇస్తాడు..ఇది తెలియగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లో దద్దరిల్లుతుంది.

బాలయ్య బాబు కి పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేస్తే బాగుంటుందో..ఏ సినిమా చేస్తే బాగుండదో అనేది కూడా తెలుసా..ఆశ్చర్యంగా ఉందే అని ఇరువురి హీరోల అభిమానులు షాక్ కి గురైయ్యారు..బాలయ్య బాబు కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఇంత అనుబంధం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు..ఇది ఇలా ఉండగా అన్ స్టాపబుల్ విత్ NBK సీసన్ 2 చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవుతాడు అని గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈరోజు జరిగిన ఎపిసోడ్ తో అది ఫిక్స్ అయిపోయింది అనే చెప్పాలి..ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.