Mega Family
Mega Family : ఇండస్ట్రీకి చిరంజీవి రూపంలో గొప్ప నటుడిని ఇచ్చింది అంజనాదేవి కొణిదెల. ఆమె పెద్ద కుమారుడైన శివ శంకర వరప్రసాద్.. చిరంజీవిగా మారి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తున్నాడు. అలాగే సామాజిక సేవ చేస్తూ మానవతావాదిగా నిరూపించుకున్నాడు. రెండో కుమారుడు నాగబాబు నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో రాణిస్తున్నాడు. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. త్వరలో ఎమ్మెల్సీ హోదాలో అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఇక అంజనాదేవి మూడో కుమారుడు పవన్ కళ్యాణ్ సైతం ఒక ప్రభంజనం.
హీరోగా తిరుగులేని స్టార్డం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు. పరాజయాలు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ట్రెండ్ సెట్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంజనాదేవి ముగ్గురు కుమారులు చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్ నలుగురికి స్ఫూర్తిని ఇచ్చే స్థాయిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో అంజనాదేవికి ఇష్టమైన కుమారుడు ఎవరు?.. ఈ విషయాన్ని చిరంజీవి లీక్ చేశారు.
Also Read : ఎన్టీఆర్ కి ఏమైంది..? ఎందుకిలా అయిపోయాడు..అవేమి లుక్స్ బాబోయ్ అంటున్న నెటిజెన్స్
ఉమెన్స్ డేను పురస్కరించుకుని మెగా ఉమన్ పేరుతో అంజనాదేవిని ఇంటర్వ్యూ చేశారు. చిరంజీవి, నాగబాబుతో పాటు ఇద్దరు కుమార్తెలు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జీవితంలో అంజనాదేవి అందించిన ప్రేమ, మద్దతు, కష్ట సమయాల్లో ఆమె ముందుకు నడిపించిన తీరును గుర్తు చేసుకున్నారు. నాగబాబు మాట్లాడుతూ.. అమ్మ ఒక్క హగ్ ఇస్తే చాలు. మనకు ఎంతో బలం. తన ప్రేమ ద్వారా అందరం కలిసి ఉండాలని ఆమె చెప్పకనే చెబుతారని, అన్నాడు. అనంతరం చిరంజీవి మాట్లాడారు.
ఎంత మంది ఉన్నా.. నాగబాబు అమ్మకు ప్రత్యేకం. నాగబాబు వద్ద ఆమె చిల్ అవుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకుంటుంది. నాగబాబు అంటేనే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పటికీ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది.. అన్నాడు. చిరంజీవి మాటలతో నాగబాబు అనే అంజనాదేవికి అమిత ఇష్టం అని తెలుస్తుంది. ఇక మెగా ఉమన్ షోకి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతుంది. అంజనాదేవి చిరంజీవి వద్దే ఉంటారు. పవన్ కళ్యాణ్, నాగబాబు వేరు వేరు నివాసాల్లో ఉంటారు. ముఖ్యమైన సందర్భాల్లో ఖచ్చితంగా అందరూ కలుస్తారు.
సంక్రాంతి, క్రిస్మస్ వంటి వేడుకలు కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి జరుపుకుంటారు. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీ మీట్స్ ని మిస్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మెగా ఉమన్ ఇంటర్వ్యూలో పాల్గొనలేదన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రోమో ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Web Title: Mega family who does mother anjanadevi like the most among chiru nagababu and pawan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com