Junior NTR : ప్రస్తుతం ఉన్నటువంటి టాలీవుడ్ హీరోలలో లుక్స్ పరంగా బాగా అనిపించే వారిలో ఒకరు ఎన్టీఆర్(Junior NTR). రామ్ చరణ్(Global Star Ram Charan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మినహా మిగిలిన స్టార్ హీరోలందరూ 50 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి 53 ఏళ్ళు, మహేష్ బాబు(Super Star Mahesh Babu) కి ఈ ఏడాదితో 50 ఏళ్ళు వస్తాయి. కేవలం రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే 40 వ ఏటలోకి ఫ్రెష్ గా అడుగుపెట్టారు.’దేవర’ చిత్రం లో ఎన్టీఆర్ మంచి గ్లో తో వెండితెర పై వెలిగిపోయాడు. కానీ ఆయన లేటెస్ట్ ఫోటో ని చూసిన అభిమానులు షాక్ కి గురయ్యారు. ఏమైంది ఎన్టీఆర్ కి, ఎందుకిలా అయిపోయాడు?, లుక్ అసలు బాగాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ ‘ZEPTO’ యాడ్ లో కనిపించాడు. ఈ యాడ్ లో లేడీ కమెడియన్ విద్యులేఖ రామన్ కూడా కనిపించింది.
Also Read : ఆ ముగ్గురితో సీన్ అంటే ఎన్టీఆర్ కి చాలా కష్టం.. టేకులు మీద టేకులు! ఎందుకు అలా?
ఈ యాడ్ లో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సమయంలో ఎలాంటి లుక్స్ తో అయితే కనిపించాడా, అలాంటి లుక్స్ తో దర్శనమిచ్చాడు. కొంత మంది అభిమానులకు అయితే నచ్చింది కానీ, మరికొంతమంది అభిమానులకు మాత్రం ఈ లుక్ నచ్చలేదు. ఇక రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే సోషల్ మీడియా లో ఈ లుక్స్ పై విపరీతమైన ట్రోల్స్ వేస్తున్నారు. కేవలం యాడ్ షూటింగ్ కోసం ఈ లుక్ లోకి ఎన్టీఆర్ వచ్చాడా?, లేకపోతే ఇది ‘వార్ 2’ మూవీ కి సంబంధించిన లుక్ నా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఇవి రెండు కాకుండా, రీసెంట్ గానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలైంది. కొంపదీసి ఈ లుక్ ఆ సినిమాకి సంబంధించినది కాదు కదా? అని సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇదే లుక్ తో ఎన్టీఆర్ కనిపిస్తాడా లేదా అనేది.
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టీజర్ కి వాయిస్ ఓవర్ అందిస్తున్నప్పుడు కూడా ఎన్టీఆర్ ఇదే లుక్ తో ఉన్నాడు. అంటే ఈ లుక్ ‘వార్ 2’ సంబంధించినదే అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఊహిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో, అతి త్వరలోనే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఒక అడుతమైన డాన్స్ నెంబర్ ని చిత్రీకరించబోతున్నారు మేకర్స్. నాటు నాటు ని మించిన స్టెప్పులు ఇందులో ఉంటాయట. ఈ నెలలోనే ఆయన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది.
Also Read : 500 మంది డాన్సర్స్ తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సాంగ్..’నాటు నాటు’ ని మించిన స్టెప్పులతో ఫ్యాన్స్ కి పండగే!