Meenakshi Chaudhary : ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్ చాలా స్పీడ్ గా స్టార్ లీగ్ లోకి వచ్చేస్తున్నారు. కానీ ఆ స్టార్ స్టేటస్ ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోతున్నారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ మొత్తం శ్రీలీల జపం చేసింది. ఇప్పుడు ఆమెకి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కనిపించడం బాగా తగ్గించేసింది. ఒప్పుకున్న సినిమాలు కూడా చేజారిపోతున్నాయి. ఇప్పుడు ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చేసింది. ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీ లోకి దూసుకుపోతుంది. సుశాంత్ హీరో గా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ మిస్ ఇండియా బ్యూటీ, ఆ తర్వాత ఖిలాడీ, హిట్ – ది సెకండ్ కేస్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఖిలాడీ చిత్రం యావరేజ్ గా ఆడగా, హిట్ – ది సెకండ్ కేస్ మాత్రం పెద్ద హిట్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత ఆమె ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’, తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రాల్లో చేసి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే ఈమెకు అవకాశాలు క్యూలు కట్టేవి, అలాంటిది ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడిన తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉంటుంది. చేతి నిండా సినిమా అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలీల స్థానాన్ని రీ ప్లేస్ చేస్తుంది. ఆమె అంత అందంగా ఉండకపోయినా, ఆమె రేంజ్ లో డ్యాన్స్ చేయకపోయినా కూడా యూత్ ఆడియన్స్ లో మీనాక్షి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది.
ప్రస్తుతం ఈమె డిమాండ్ వేరే లెవెల్ లో ఉండడంతో రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచేసింది. ఇంతకు ముందు ఒక్కో సినిమాకి కోటి రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని తీసుకునేది. ఇప్పుడు మూడు కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేస్తుందట. పెద్ద సినిమాలకు అయితే 5 కోట్లు అడుగుతుందట. ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టి హీరో గా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ని తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెని తప్పించి మీనాక్షి చౌదరీ ని తీసుకున్నారు. ఈ చిత్రం తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం లో ఈమె ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు రెండు తమిళ సినిమాల్లో నటించడానికి సంతకం చేసింది.