Brahmananda : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను కనబరచిన బ్రహ్మానందం(Bramhanandam), తనికెళ్ల భరణి(Thanikella bharani) లాంటి నటులు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ సినిమాలు చేస్తూ వాళ్ల కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇద్దరు ఒకరోజు ఒక సినిమా షూటింగ్ కి ఒక పల్లెటూరికి వెళ్లారట. అక్కడ షూటింగ్స్ స్పాట్ పక్కనే ఉన్న శివాలయం టెంపుల్ కి వెళ్లారట… ఇక అందులో ఒక పూజారి నిమగ్నమై పూజ చేస్తున్నారట. ఇక బయట నిల్చున్న బ్రహ్మానందం, తనికెళ్ల భరణి లను చూసి చిన్న నవ్వు నవ్వి తన పూజలతో మళ్ళీ దైవ సేవలో నిమగ్నమైపోయాడట. అయితే పూజ అయిపోయిన తర్వాత తను వారిని గుర్తుపట్టి చాలా ఎక్సైట్ అవుతాడని వీళ్ళు అనుకున్నారట. కానీ ఆ పూజ అయిపోయిన తర్వాత కూడా ఆయన వాళ్లను పెద్దగా పట్టించుకోలేదు. బయటకు వచ్చి వీళ్లు మా పేర్ల మీద అభిషేకం చేయండి అని చెప్పడంతో పూజ చేసే సమయం అయిపోయింది. మీకు అభిషేకం కావాలంటే రేపు పొద్దున ఏడు గంటలకు రండి అని చెప్పారట… దాంతో వాళ్ళిద్దరూ షాకపోయారట. మొత్తానికైతే నెక్స్ట్ డే ఏడు గంటలకు టెంపుల్ దగ్గరికి వెళ్లి అప్పుడు నిల్చున్నారట…ఇక అప్పుడు పూజారి వచ్చి వాళ్ల పేర్ల మీద అభిషేకం చేశాడట… దాంతో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి లు ఉన్న ప్లేస్ కే టిఫిన్స్ తీసుకొచ్చి ఇచ్చారట. దాంతో వాళ్ళు అక్కడ టిఫిన్ తింటుంటే టెంపుల్ నుంచి వెళ్ళిపోతూ కనిపించారట. అప్పుడు బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇద్దరూ కలిసి అతన్ని పిలిచి తనను కూడా వీళ్లతో పాటు టిఫిన్ చేయమని చెప్పారట.
దాంతో ఆయన నేను తినేశానని చెప్పాడట. కనీసం కాఫీ అయిన తాగండి అని చెప్పినప్పటికి ఆ పూజారి వద్దు అని చెప్పారట. దాంతో తనికెళ్ల భరణి కొంచెం గర్వం తో ఇంతకీ మేము ఎవరో మీకు తెలుసా అని అడిగాడట. దాంతో పూజారి మీరు తనికెళ్ల భరణి మీ పక్కనున్నది బ్రహ్మానందం గారిని చెప్పారట దానికి కూడా వాళ్ళు షాక్ అయ్యారట…
మరి మా గురించి తెలిసిన ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అడిగారట. దానికి ఆ పూజారి నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది నాకు శివుడు ఉన్నాడు. ఇవి చాలు కదా నేను బతకడానికి అంటూ ఆయన సమాధానం చెప్పడంతో వీళ్ళలో ఉన్న అహం ఒక్కసారిగా చచ్చిపోయిందని తనికెళ్ల భరణి చెప్పడం విశేషం…
ఈ ఆశ లేకపోతే ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు కదా అనే ఒక గొప్ప సందేశాన్నైతే అతని లైఫ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటూ తనికెళ్ల భరణి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఇలాంటి మనిషిని తను ఎప్పుడు చూడలేదని ఇతరుల దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా బతికే వాళ్ళు కూడా ఉంటారా అనే విషయమైతే నాకు ఆయనను చూసిన తర్వాత అర్థమైంది అంటూ భరణి చెప్పడం విశేషం… ఇక అప్పటికప్పుడు ఆయన ఆ పూజారి వ్యక్తిత్వం మీద ఒక పాటను కూడా రాసుకున్నాడట…
“మా సెడ్డ మంచోడు దేవుడు
మాసెడ్డ మంచోడు దేవుడు…
నువ్వోటి అడిగితే వాడోటి ఇస్తాడు దేవుడు
మాసెడ్డ మంచోడు దేవుడు
అసలడక్కపోతే అన్ని ఇచ్చేస్తాడు
మాసెడ్డ మంచోడు దేవుడు”…
మొత్తానికైతే ఆ పూజారి జీవితం వల్ల వాళ్ళకి ఒక గొప్ప నితి అయితే బోధపడిందనే చెప్పాలి…