Raja Saab Advance Bookings: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో మొదలయ్యాయి. నార్త్ అమెరికా లో 20 వేల టిక్కెట్లు, లండన్ లో మరో 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ లో కూడా బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలు అవ్వబోతుంది అనే దానిపై ఇప్పటి వరకు ఫ్యాన్స్ కి ఎలాంటి క్లారిటీ లేదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేడు రాత్రి ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన టికెట్ రేట్స్ జీవో విడుదల అవుతుందని, నేడు రాత్రే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడతారనే టాక్ నడుస్తుంది.
ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ 1000 రూపాయిల వరకు ఉంటుందట. అయితే అన్ని ప్రాంతాల్లో ఇదే రేట్స్ పెట్టారట. ఉదాహరణకు వైజాగ్ లాంటి సిటీస్ లో వెయ్యి రూపాయిల టికెట్ రేట్స్ పెట్టినా అమ్ముడుపోతాయి. అందుకే వైజాగ్, విజయవాడ , గుంటూరు, నెల్లూరు వంటి సిటీస్ లో టికెట్ రేట్స్ వెయ్యి రూపాయిలు ఉంచుతారట. B సెంటర్స్ లో 800 రూపాయిలు, C సెంటర్స్ లో 600 రూపాయిల రేంజ్ లో పెడతారట. ఇది ది బెస్ట్ స్ట్రాటజీ అని సోషల్ మీడియాలో అభిమానులు మూవీ టీం ని మెచ్చుకుంటున్నారు. ఇక రెగ్యులర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నేడు రాత్రే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ షోస్ టికెట్ రేట్స్ సింగల్ స్క్రీన్స్ 296 రూపాయిలు ఉండగా, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ 377 రూపాయిల వరకు ఉంటుంది.
ఇక నైజాం విషయం లో చివరి నిమిషం వరకు అభిమానులు టెన్షన్ పడే అవకాశాలు ఉన్నాయి . ఎందుకంటే గతంలో ఓజీ, అఖండ 2 , హరి హర వీరమల్లు చిత్రాలకు ప్రీమియర్ షోస్ టికెట్స్ రేట్స్, అదే విధంగా రెగ్యులర్ షోస్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఎందుకు ఇచ్చారు?, తక్షణమే జీవో ని వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి నా ప్రమేయం లేకుండానే టికెట్ రేట్స్ జీవో విడుదల అవుతున్నాయని, ఇక మీదట నిర్మాతలు టికెట్ రేట్స్ కోసం నా వద్దకు రావొద్దు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన రాజా సాబ్ చిత్రానికి ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్, రెగ్యులర్ షోస్ టికెట్ రేట్స్ ఇస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.