https://oktelugu.com/

Venkatesh: కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో విక్టరీ వెంకటేష్ రొమాన్స్..మండిపడుతున్న అభిమానులు!

ఇప్పటికీ కూడా వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్స్ కి క్యూలు కడుతారు. అయితే వెంకటేష్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం నుండి ఎక్కువగా మల్టీస్టార్రర్ సినిమాలే చేస్తున్నాడు. సోలో హీరో గా చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : August 27, 2024 / 11:55 AM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh: ఇప్పటికీ నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టగల సత్తా ఉన్న సీనియర్ హీరోస్ లో ఒకరు విక్టరీ వెంకటేష్. నిన్నటి తరం హీరోలలో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అత్యధికంగా మెగాస్టార్ చిరంజీవి తర్వాత వెంకటేష్ కి మాత్రమే ఉండేవి. ఓపెనింగ్ రికార్డ్స్ నుండి క్లోసింగ్ రికార్డ్స్ వరకు వెంకటేష్ కి అన్ని ఉండేవి. ముఖ్యంగా లాంగ్ థియేట్రికల్ రన్ వెంకటేష్ కి వచ్చినట్టుగా చిరంజీవి కి కూడా రాదు అని అప్పటి ట్రేడ్ పండితులు చెప్తుండేవారు. ఎందుకంటే వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పటికీ కూడా ఎవరైనా స్టార్ హీరో ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ని సంపాదిస్తే వెంకటేష్ తో పోల్చి చూస్తారు. ఆ స్థాయి బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడాయన.

    Venkatesh(1)

    ఇప్పటికీ కూడా వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్స్ కి క్యూలు కడుతారు. అయితే వెంకటేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం నుండి ఎక్కువగా మల్టీస్టార్రర్ సినిమాలే చేస్తున్నాడు. సోలో హీరో గా చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అందుకే ఈసారి సోలో హీరోగా భారీ హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. తనకు F2,F3 లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన అనిల్ రావిపూడి తో రీసెంట్ గానే ఆయన ఒక సినిమా మొదలు పెట్టాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ ఆయన భార్యగా, అలాగే మీనాక్షి చౌదరి ఆయన లవర్ గా ఇందులో కనిపించనున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ మీద ఒక రొమాంటిక్ సాంగ్ ని పొలాచ్చి లో చిత్రీకరిస్తున్నారు. ఇదంత పక్కన పెడితే ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన వెంకటేష్ కి అత్యంత సన్నిహితుడు కూడా. చిన్నతనం లో ఉన్నప్పుడు ఐశ్వర్య రాజేష్ ని అనేక సార్లు ఆయన వెంకటేష్ వద్దకు తీసుకెళ్లాడు.

    ఒక విధంగా చెప్పాలంటే ఐశ్వర్య రాజేష్ కి వెంకటేష్ తండ్రి వరుస అవుతాడు. అలాంటి వ్యక్తి తో రొమాన్స్ ఎలా చేస్తావంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వెంకటేష్ పై, ఐశ్వర్య రాజేష్ పై విరుచుకుపడుతున్నారు. సినిమా అన్నాక ఇలాగే ఉంటుంది. ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు, కేవలం పాత్రలను మాత్రమే చూడాలి. ఒకప్పుడు శ్రీదేవి ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి వారికి కూతురుగా నటించింది, పెద్దయ్యాక హీరోయిన్ గా కూడా చేసింది. అప్పట్లోనే హీరోలకు ఇలాంటి పట్టింపులు ఉండేవి కాదు, ఇప్పుడు మనం పట్టింపులు కోరుకోవడంలో అర్థం లేదంటూ విశ్లేషకులు చెప్తున్న మాట.