Vedham : కొంత మంది హీరోయిన్లు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే మంచి క్రేజ్ ని తెచ్చేసుకుంటారు. ఇక ఆ హీరోయిన్ కి తిరుగులేదు అని మనం టీవీ లలో వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి హీరోయిన్స్ ఎంత తొందరగా అయితే ఎదుగుతున్నారో, అంతే తొందరగా కనుమరుగు అయిపోతున్నారు. ఇటీవల కాలం లో ఇలాంటి సందర్భాలు చాలానే చూసాము. గతంలో కూడా ఒక హీరోయిన్ ఇలాగే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఇక ఈమెకు తిరుగే ఉండదు అని అందరూ అనుకుంటున్న సమయంలో వరుస ఫ్లాప్స్ కారణంగా కనిపించకుండా పోయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, దీక్షా సేత్(Deeksha Seth). ప్రముఖ దర్శకుడు క్రిష్(Krish Jagarlamudi) తెరకెక్కించిన ‘వేదం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి ఈమె హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి జోడీగా నటించి అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.
Also Read : సినిమాలు మానేసిన ఈ భామ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..
ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా, మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. దీక్ష సేత్ కి కూడా ఆఫర్స్ వరుసగా క్యూలు కట్టాయి. ఈ చిత్రం తర్వాత ఆమె రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిరపకాయ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. కమర్షియల్ గా ఈ చిత్రం ఆరోజుల్లో పెద్ద హిట్. దీక్ష సేత్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆమె ఏకంగా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘రెబెల్’ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ క్యారక్టర్ లో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక్కడి నుండే దీక్ష సేత్ కి బ్యాడ్ టైం మొదలైంది. ఈ చిత్రం తర్వాత ఆమె రవితేజ తో కలిసి చేసిన ‘నిప్పు’ అనే చిత్రం మరో ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.
అదే విధంగా గోపీచంద్ తో చేసిన ‘వాంటెడ్’, మంచు మనోజ్ తో చేసిన ‘ఊ కొడతారా..ఉలిక్కి పడుతారా’ వంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ మొత్తం మీద మిరపకాయ్ తప్ప మరో హిట్ లేదు. దీంతో ఈమెకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది వర్క్ అవుట్ అవ్వలేదు. అదే విధంగా కన్నడ లో దర్శన్ లాంటి స్టార్ హీరో నటించిన ‘జగ్గూభాయ్’ చిత్రం హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికింది, ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఈమె సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి లండన్ కి వెళ్ళిపోయింది. అక్కడ ఈమె ప్రస్తుతం ఒక ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రోగ్రామింగ్ డిజైనర్ గా పని చేస్తుంది. ఆమె జీతం నెలకు ఆరు లక్షల రూపాయలకు పైమాటే అట.
Also Read : ‘వేదం’ హీరోయిన్ గుర్తుందా..? సినిమాలు మానేసిన తర్వాత ఇప్పుడు ఈమె చేస్తే జాబ్ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!