వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?

దేశంలో కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోయిన సంగతి తెల్సిందే. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులు మళ్లీ పట్టాలెక్కుతుండగా.. థియేటర్ల ఓపెనింగ్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. థియేటర్లు మూతపడటంతో సినిమా నిర్మాతలందరూ ఓటీటీల వైపే చూస్తున్నారు. కొత్త సినిమాలన్నీ ప్రస్తుతం ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. Also Read : వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా? కరోనా కారణంగా అత్యధికంగా లాభపడిన సంఘం ఏదైనా ఉందంటే అది ఓటీటీ అని చెప్పొచ్చు. […]

Written By: Neelambaram, Updated On : August 31, 2020 4:08 pm
Follow us on

దేశంలో కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోయిన సంగతి తెల్సిందే. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులు మళ్లీ పట్టాలెక్కుతుండగా.. థియేటర్ల ఓపెనింగ్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. థియేటర్లు మూతపడటంతో సినిమా నిర్మాతలందరూ ఓటీటీల వైపే చూస్తున్నారు. కొత్త సినిమాలన్నీ ప్రస్తుతం ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.
Also Read : వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?
కరోనా కారణంగా అత్యధికంగా లాభపడిన సంఘం ఏదైనా ఉందంటే అది ఓటీటీ అని చెప్పొచ్చు. థియేటర్లు మూతపడటం ఓటీటీకి బాగా కలిసొచ్చింది. నిర్మాతల వద్ద తక్కువ ధరకే సినిమాలను కొనుగోలు చేసి ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. గత్యంతరం లేక నిర్మాతలు వారు అడిగిన ధరకే సినిమాలను అమ్మేస్తున్నట్లు టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే పలు కొత్త చిత్రాలు ఓటీటీలో రిలీజు అవగా.. మరికొన్ని రిలీజుకు రెడీ అవుతున్నాయి.

తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 30 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఇళయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీకి ఒక ఓటీటీ సంస్థ 100కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆఫర్ కు నిర్మాత ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది. కొంత ఆలస్యమైనా ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.

తమిళ ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ‘మాస్టర్’ మూవీని తెరకెక్కించాడు. ఇందులో విజయ్ ద్విపాత్రభిమానం చేయనున్నాడు. గ్యాంగ్ స్టర్ గా.. ప్రొఫెసర్ గా కన్పించబోతున్నాడు. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ గత చిత్రం ‘బిగిల్’ తమిళంతోపాటు తెలుగులో భారీ విజయం సాధించింది. ఇండియాలోనే ఈ మూవీ 200కోట్ల మార్క్ దాటేసిందన్ టాక్ ఉంది. దీంతో ‘మాస్టర్’ మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉండగా కరోనా మూవీ వాయిదా పడింది.