ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టిడిపి నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కలుస్తాను అని అంటున్నాడు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ నుండి తన సొంత నియోజకవర్గం హిందూపురం కి వెళ్ళిన బాలయ్య ప్రభుత్వ ఆసుపత్రి కి తన తరఫున 50 లక్షల విలువైన మందులను, కొన్ని వైద్య పరికరాలను అందించాడు. అలాగే ఇదే సందర్భంగా తను త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే హోదాలో కలుస్తాను అని ప్రకటించారు.
Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?
హిందూపురంలో మెడికల్ కాలేజీ విషయమై సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవాలని బాలయ్య చెప్పుకొచ్చారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని…. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ఊరికే ఉండలేం అని.. ప్రభుత్వాన్ని అడుగుతాం అని… అవసరమైతే పోరాటం చేస్తా,అని బాలకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికే మెడికల్ కాలేజీ కి సంబంధించి సంబంధిత ఏపీ రాష్ట్ర మంత్రి తో మాట్లాడినట్టు బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం పై ఇదే సందర్భంగా ఆయన విమర్శలు కూడా గుప్పించారు.
“గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో కనీస అభివృద్ధి కూడా జరగలేదు. కక్ష సాధింపు ఒక్కటే కనబడింది. ఇక రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టడం లేదు” అని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో తెలంగాణ తో పోటీపడింది కానీ…. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పరిస్థితి చాలా దయనీయంగా ఉందని బాలయ్య అన్నారు. కరోనా కారణంగా ఇది వరకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు అని…. ఇక త్వరగా వెళ్ళి ఆయనను కలుస్తానని బాలయ్య చెప్పడం విశేషం.
ఇదిలా ఉంటే బాలయ్య విమర్శించే క్రమంలో వైసీపీ శ్రేణులు ఎప్పుడూ సంయమనం పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నందమూరి బాలకృష్ణ కు వీరాభిమాని. కడప టౌన్ ప్రెసిడెంట్‌గా వైఎస్ జగన్ పేరుతో కూడిన ఒకప్పటి హోర్డింగ్‌ల తాలూకు ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ ను కలిసేందుకు బాలయ్య కి చంద్రబాబు అనుమతిని ఇస్తారా అన్నది సందేహంగా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలు బాలకృష్ణని కలుస్తుండడంతో చంద్రబాబు చిర్రుబుర్రులాతున్నాడు. అలాంటిది ఏకంగా మెడికల్ కాలేజీ విషయమై బాలయ్య వైసిపి అధినేత తో మాట్లాడడం బాబుకి రుచించకపోవచ్చు. మరి బాలకృష్ణ ప్రయత్నాలకు చంద్రబాబు మోకాలడ్డకుండా ఉంటారా…?
Also Read : జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?