https://oktelugu.com/

బిగ్ బాస్-4 లోకి అల్లరి నరేష్ హీరోయిన్..!

బిగ్ బాస్ సీజన్ – 4 ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. కరోనా నేపథ్యంలో సినిమా హాళ్ళు మూతపడి ఎంటర్టైన్మెంట్ కరువైన ప్రేక్షకులందరికీ ఈ బుల్లితెర రియాల్టీ షో ఎంతోకొంత ఆకలి తీరుస్తుందని అందరి నమ్మకం. అయితే ఈ మోస్ట్ పాపులర్ షో హిట్ కావాలంటే… ఎన్ని ఆసక్తికరమైన టాస్క్ లు, గేమ్స్, మైండ్ గేమ్స్ ఉన్నా కూడా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా అదే రేంజ్ సమర్ధత కలిగిన వారు అయి ఉండాలి. Also Read : […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 31, 2020 / 04:01 PM IST
    Follow us on

    బిగ్ బాస్ సీజన్ – 4 ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. కరోనా నేపథ్యంలో సినిమా హాళ్ళు మూతపడి ఎంటర్టైన్మెంట్ కరువైన ప్రేక్షకులందరికీ ఈ బుల్లితెర రియాల్టీ షో ఎంతోకొంత ఆకలి తీరుస్తుందని అందరి నమ్మకం. అయితే ఈ మోస్ట్ పాపులర్ షో హిట్ కావాలంటే… ఎన్ని ఆసక్తికరమైన టాస్క్ లు, గేమ్స్, మైండ్ గేమ్స్ ఉన్నా కూడా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా అదే రేంజ్ సమర్ధత కలిగిన వారు అయి ఉండాలి.

    Also Read : పోలీస్ గా దర్శనమిచ్చిన హాట్ బ్యూటీ ! 

    వాళ్ళు అరుస్తుంటే ప్రేక్షకులు కూడా వారితో కలిసి పూనకం వచ్చినట్లు రెచ్చిపోవాలి.. వారి ఏడుస్తుంటే జాలి పడాలి లేదా వారు వాదిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి…. సోషల్ మీడియాలో వారి తరఫున పోస్టులు వేయాలి. అంతటి ఇంపాక్ట్ చేయగల సెలబ్రిటీలు మాత్రమే బిగ్ బాస్ షో కి అర్హత పొందుతారు. అయితే ఇప్పటికే ఇదే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ ఇప్పటికే ఎన్నో లిస్ట్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాటిల్లో కామన్ గా.. కన్ఫర్మ్ అయిపోయిన పేర్లు కూడా కొన్ని ఉన్నాయి.

    సింగర్ గీతా మాధురి భర్త నందు, పూనం బజ్వా, అపూర్వ, ప్రియా వడ్లమాని యామిని భాస్కర్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరందరి తోపాటు జతకట్టేందుకు చివరి నిమిషంలో అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రం ‘సుడిగాడు’ హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.

    చాలా మంది అందగత్తెలతో ఈ సీజన్ బిగ్ బాస్ ను ప్యాక్ చేసిన నిర్వాహకులు… నాలుగో సీజన్ కు ఈమె మరింత రెట్టింపు అందాన్ని… ప్రేక్షకులకు ఆసక్తిని తీసుకుని వస్తుందని భావిస్తున్నారు. ఏదైనా మోనాల్ కు తోడుగా మరి కొంత మంది అందగత్తెలు హౌస్ లో సందడి చేయబోతున్నారు. వీరితోపాటు తను ఎలా సఖ్యతగా ఎలా ఉంటుంద్దో… ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి…!

    Also Read : వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?