Mass Jathara Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది… ప్రస్తుతం ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. అందుకే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కొత్త దర్శకులు భారీ విజయాలను సాధిస్తున్నారు. ఇక మరికొంతమంది దర్శకులు మాత్రం రొటీన్ రొట్టా కథలను కథలు సినిమాలుగా ఎంచుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేసి బొక్క బోర్లా పడుతున్నారు. ఇక రవితేజ లాంటి స్టార్ హీరో గత కొన్ని సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయనే ఒక భ్రమలో తను ఉండడం వల్ల అలాంటి కథలకే ఓటేస్తున్నాడు. ఫైనల్ గా ‘మాస్ జాతర’ లాంటి రొటీన్ కథలతో సినిమాలు వచ్చి బొక్క బోర్లా పడుతున్నాయి… మాస్ జాతర సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేశారు. ఇక ప్రీమియర్స్ చూసిన చాలా మంది జనాలకు ఈ సినిమా నచ్చలేదు.
రొటీన్ స్టోరీ అప్పుడెప్పుడో నైన్టీస్ లో వచ్చిన స్క్రీన్ ప్లే ని ఫాలో అవుతూ దర్శకుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయకపోగా విసిగించాడు. దాంతో చాలా మంది థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు… కారణం ఏంటి అంటే రవితేజ ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు చాలానే చేశాడు. తన సినిమాను తనే కాపీ చేసుకున్నాడా అనే రేంజ్ లో ప్రేక్షకులకు ఒక డౌట్ అయితే కలుగుతోంది.
అందువల్లే ఆ సినిమాని చూడడానికి కనీసం రవితేజ అభిమానులు కూడా సాహసం చేయట్లేదు అంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా బాగా మాట్లాడాడు. సినిమా అద్భుతంగా వచ్చిందని ఈసారి కచ్చితంగా సూపర్ హిట్ కొడుతున్నామంటూ చాలా ప్రగల్భాలు పలికాడు… అయినప్పటికి సినీమా మాత్రం ఏ ఒక ప్రేక్షకుడిని ఆకట్టుకోకపోగా ఇలాంటి కథలతో సినిమాలు చేయడం ఎందుకు అంటూ రవితేజను అలాగే నాగ వంశీని సైతం చాలా మంది విమర్శిస్తున్నారు…
మీరు ఇలాంటివి కాకుండా గొప్ప సినిమాలు చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి నాసిరకం సినిమాలు చేయడం ఎందుకయ్యా అంటూ నాగవంశీ మీద ఫైర్ అవుతున్నారు. గత సంవత్సరం లక్కీ భాస్కర్ లాంటి గొప్ప సినిమా చేసిన నాగవంశీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తే తన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడవుతాడు. ఇక ప్రయోగాత్మకమైన సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి సినిమాలు చేయకండి అంటూ నాగవంశీని ఉద్దేశించి చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు…



