Mass Jathara Premiere Shows Twitter Talk: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ నేడు ప్రీమియర్ షోస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్ తో, థియేట్రికల్ ట్రైలర్ తో మాస్ ఆడియన్స్ లో కచ్చితంగా వింటేజ్ రవితేజ కం బ్యాక్ అవుతాడనే నమ్మకం కలిగించిన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకుందా?, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ అంటూ నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉందా లేదా ?, అసలు కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా?, ప్రీమియర్స్ నుండి అసలు ఎలాంటి టాక్ వచ్చింది అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా చూడబోతున్నాము.
#MassJathara continuity a ledhu #BhanuBhogavarapu
Ravi Teja fans ki nachchuthey chaalu…
Ravi Teja mass nd performance a baavundhi movie motham lo…
Migitha vaalu antha …— Phani (@Chilipi_Tiger) October 31, 2025
ఈ సినిమా ఆరంభం కాస్త రొటీన్ గా మొదలైంది. అసలే రొటీన్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ రోత పుట్టిస్తున్నాడు అనే ఫీలింగ్ తో ఆడియన్స్ ఉంటే, హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మరింత క్రింజ్ గా మారిపోయింది. రవితేజ గత చిత్రం రొటీన్ గా అనిపించినప్పటికీ పాటలు బాగుండడం తో ఆడియన్స్ కి కాస్త రిలాక్స్ ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ చిత్రం లో ఒక్క పాట కూడా క్లిక్ అవ్వకపోవడం మరో పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ గా అనిపించడం తో ఫస్ట్ హాఫ్ మాస్ ఆడియన్స్ కి ఫ్లాప్, కాస్త కొత్త రకమైన సినిమాలను ఇష్టపడే వారికి డిజాస్టర్ అనే ఫీలింగ్ ఫస్ట్ హాఫ్ కి కలుగుతుంది.
Ante annam antav gani.. E story lo heroine endhuku bro @RaviTeja_offl .. Screen play avg ga vunna heroine portion worst core la chesindhi#MassJathara
— Rajuuuuuuu (@Myself553041) October 31, 2025
ఇక సెకండ్ హాఫ్ లో అయినా డైరెక్టర్ కరుణిస్తాడేమో అని ఆడియన్స్ ఎదురు చూసారు. కానీ ఇది కూడా డిజాస్టర్ రేంజ్ లోనే ఉందని చెప్పాలి. నిర్మాత నాగవంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన టాక్ లో పావు శాతం కూడా ఇందులో లేదు. ఇక రవితేజ విషయానికి వస్తే ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఈ సినిమాలో కూడా రాజా ది గ్రేట్ లో లాగ అంధుడి గానే లుక్స్ ఇస్తున్నట్టు అనిపించింది అంటున్నారు ఆడియన్స్. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు తన ఎనర్జిటిక్ నటన తో ఈ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసాడు.కానీ సినిమాలో ఇసుమంత కూడా విషయం లేకపోవడం తో డిజాస్టర్ అనే ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటకు వస్తారు. ఇక శ్రీలీల ని చూస్తే ఈమెని హీరోయిన్ ఎలా చేశారు బాబు అనే ఫీలింగ్ కలిగింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె ముఖం కూడా హీరోయిన్ రేంజ్ లో లేదని, సినిమాకు చాలా మైనస్ అయ్యిందని అంటున్నారు. ఇక విలన్ గా నవీన్ చంద్ర నటన పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కి ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది, కానీ మిగిలిన వాళ్లకు ఫ్లాప్ నుండి డిజాస్టర్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది ఈ చిత్రం.