https://oktelugu.com/

Akkineni family : అక్కినేని ఫ్యామిలీ కి మాస్ సినిమాలు కలిసి రావడం లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 16, 2024 / 01:36 PM IST

    Akkineni family

    Follow us on

    Akkineni family : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే అక్కినేని ఫ్యామిలీ హీరోలకు మాత్రం కొన్ని సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా కలిసి రావడం లేదు. కారణం ఏదైనా కూడా వాళ్ల సినిమా సెలక్షన్ లోనే చాలా వరకు లోపం ఉందంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆ ఫ్యామిలీ హీరోలకు భారీ సక్సెస్ రావాలంటే వాళ్ల స్ట్రాంగ్ జోన్ ను తెలుసుకొని అందులోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగితే మంచిదని సినిమా విమర్శకులు అభిప్రాయపడుతున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక నాగేశ్వరరావు దగ్గర నుంచి ఇప్పుడు చేస్తున్న నాగచైతన్య, అఖిల్ వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అంటే రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్తూ ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా కూడా రొమాంటిక్ సినిమాలను చేస్తూనే సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అలా కాకుండా ఇప్పుడు నాగచైతన్య అఖిల్ లాంటి వారు మాస్ సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తు ముందుకు సాగుతున్నప్పటికి వాళ్లకి మాస్ సినిమాలతో మాత్రం పెద్దగా సక్సెస్ దక్కడం లేదు. కారణం ఏదైనా కూడా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఒక బ్రాండ్ అయితే పడిపోయింది. వీళ్ళు రొమాంటిక్ సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే లవ్ స్టోరీస్ ని చేయడంలో కూడా వీళ్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.

    మరి ఇలాంటి సినిమాలను చేయకుండా మాస్ జపం ఎందుకు చేస్తున్నారు అంటూ అక్కినేని ఫ్యామిలీ మీద కొంతమంది సినిమా మేధావులు సైతం విమర్శలనైతే చేస్తున్నారు. ఇక అఖిల్ ప్రస్తుతానికి ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇంతవరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేదు. కారణం ఏదైనా కూడా ఆయన కెరియర్ అనేది భారీగా డౌన్ అయిపోతుంది.

    మరి ఇలాంటి సందర్భంలో ఆయన మాస్ సినిమాలు చేయకుండా కంటెంట్ బెస్డ్ గా ఉండే లవ్ స్టోరీస్ ని గాని లేదంటే రొమాంటిక్ చిత్రాలను గాని తెరకెక్కిస్తే మాత్రం ఆయన సూపర్ సక్సెస్ ని అందుకుంటాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న వారసత్వపు హీరోలందరూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం చాలా వరకు ఢీలా పడిపోతున్నారనే చెప్పాలి.

    ముఖ్యంగా వాళ్ళ స్టోరీ సెలక్షన్ లోనే లోపం ఉంటుంది. కాబట్టి అందువల్లే వారు భారీ సక్సెస్ లను అయితే సాధించలేకపోతున్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసుకొని వాటి మీద ఫోకస్ చేసి అలాంటి సినిమాలను చేసుకుంటూ ముందుకెళ్తే మంచిదని మరి కొంతమంది విమర్శకులు సైతం వాళ్ళకి సలహాలను ఇస్తున్నారు…