
Director Maruthi: మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగానే చేస్తాడు. ఇప్పుడు ఆయన తీసిన ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాను మారుతి అతి తక్కువ బడ్జెట్ లో చేశాడు. పైగా 30 రోజుల్లోనే ఈ సినిమా షూట్ ను పూర్తి చేశాడు. ఈ సినిమాకు నిర్మాత ఎస్.కె.ఎన్ అని పేరు పడుతుంది. అయితే అసలు నిర్మాత మాత్రం ‘మారుతి’నే.

చిన్న చిత్రాలకు అందుబాటులో ఉండే సంతోష్ శోభన్ ను హీరోగా పెట్టుకుని అతనికి కేవలం మూడు లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ ను ఇచ్చాడు. అలాగే ప్రస్తుతం హీరోయిన్ మెహ్రీన్ సినిమాల ఛాన్స్ ల కోసం బాగా ఆరాటపడుతుందని గ్రహించి ఆమెకు పది లక్షలు మాత్రమే ఇచ్చి.. ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేశాడు. ఇక మిగిలిన పాత్రధారులందరికీ రెమ్యునరేషన్స్ చాలా తక్కువ.
మొత్తానికి ‘లో బడ్జెట్’ కోటితో సినిమా తీసేసి.. గుడ్ ప్రాఫిట్స్ కి సినిమాను కొన్ని ఏరియాల్లో అమ్ముకుని.. ముఖ్యమైన కమర్షియల్ ఏరియాల్లో మాత్రం మారుతి డైరెక్ట్ గా తన సినిమాను రిలీజ్ చేసుకున్నాడు. దాంతో ఈ చిన్న ప్రాజెక్ట్ తో మారుతికి దాదాపు ఇరవై కోట్లు వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా ఈ చిత్రం రిలీజ్ కి ముందే ఓటిటి హక్కులను ఆహా తీసుకొంది.
ఇక శాటిలైట్ హక్కులు స్టార్ మా కొనుగోలు చేసింది. నిజానికి ఈ సినిమాకు శాటిలైట్ కి వచ్చిన మొత్తం అంత కూడా బడ్జెట్ కాలేదు. అందుకే డిజిటల్ రైట్స్ తో పాటు థియేటర్ నుంచి వచ్చే రెవిన్యూ అంతా లాభమే. వాస్తవానికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి పెద్దగా బజ్ లేదు. కానీ కలెక్షన్స్ మాత్రం బాగా వస్తున్నాయి.
కారణం.. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘పెద్దన్న’, ‘ఎనిమి’ చిత్రాల టాక్ బాగా లేకపోవడం కారణంగా ఈ చిత్రానికి బాగానే గిట్టుబాటు అవుతుంది. ఎలాగూ మిగిలిన చిత్రాలతో పోల్చితే ఈ చిత్రమే బెటర్ అన్న టాక్ ఉంది కాబట్టి.. ఈ వారం కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.