Maruthi on negative reviewers: ఈ సంక్రాంతికి ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాల మధ్య భారీ లెవెల్ లో విడుదలై అందరినీ నిరాశకు గురి చేసింది. ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి సినిమాల్లో మృగరాజు, అజ్ఞాత వాసి, గుంటూరు కారం , గేమ్ చేంజర్ భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ ‘రాజా సాబ్’ సినిమా వాటికంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే నేడు భోగి రోజు అయినప్పటికీ కూడా కనీస స్థాయి ఆక్యుపెన్సీలను కూడా నమోదు చేసుకోలేకపోయింది. మరోపక్క ఈ సంక్రాంతికి విడుదలైన ప్రతీ సినిమాకు మంచి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం, ఆడియన్స్ కి ఆ సినిమాలే ఛాయస్ అవ్వడం తో ‘రాజా సాబ్’ ని పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారు. ఫలితంగా హైదరాబాద్ లాంటి సిటీ లో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లలో ఈ చిత్రానికి కేవలం రెండు మూడు షోస్ మాత్రమే మిగిలాయి అంటే నమ్ముతారా చెప్పండి?, కానీ ఈ సినిమాకు అలా జరిగింది.
చరిత్రలో ఒక స్టార్ హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి వారం రోజులు గడవకముందే ఇంత తక్కువ షోస్ కి పడిపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ని నిన్న మూవీ నిర్వహించారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మారుతీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ ఇది బాగా గుర్తు పెట్టుకోండి, మూడు సంవత్సరాల కష్టం, మూడు గంటలుగా సినిమా తీసి చూపిస్తుంటే, ఇష్టమొచ్చినట్టు సోషల్ మీడియా లో ట్రోల్స్ వేస్తున్నారు. మా కష్టం ని ఎగతాళి చేస్తూ శునకానందం పొందుతున్నారు. ఇంకొంతమంది మేధావులు అయితే పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన వారిపై నోర్లు పారేసుకుంటున్నారు. ఇలా అన్యాయంగా ట్రోల్స్ చేసిన వారు కచ్చితంగా ఎదో ఒక రోజు బాధపడతారు. అయ్యో ఆరోజు రాజా సాబ్ చిత్రాన్ని ట్రోల్ చేయకుండా ఉండాల్సిందే అని పశ్చాత్తాపం చెందుతారు. ఇదంతా వాళ్లకు తిరిగి వస్తుంది. కర్మ ఎవరినీ విడిచి పెట్టదు. ఇది నా శాపం కాదు, ప్రకృతి మొత్తం చూస్తూనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ.
మారుతీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ని పెట్టుకొని, నాసిరకపు సినిమా తీయడమే కాకుండా, ఆ సినిమాని చూసిన వాళ్ళని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు ఈ రేంజ్ లో తిట్టడం సరికాదు. ఎవరైతే నిన్ను ఈరోజు ట్రోల్ చేస్తున్నారో, నువ్వు మంచి సినిమాని తీసినప్పుడు ప్రోత్సహించారు. నువ్వు చెత్త సినిమా తీసావు, ఇప్పటికైనా స్పృహలోకి వచ్చి అర్థం చేసుకో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.