RRR Effect on IPL: వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పిచ్చిగా టీవీలకు అతుక్కుపొయ్యి చూసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి..అలాంటి వాటిల్లో IPL క్రికెట్ మ్యాచ్ సీసన్ కూడా ఒక్కటి, IPL సీసన్ కి జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సీసన్ లో సినిమాలు విడుదల చెయ్యాలి అంటే వణికిపోతారు దర్శక నిర్మాతలు..గతం లో అలా ధైర్యం చేసి IPL సీసన్ లో విడుదల చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి, అలా IPL ప్రభావం రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా పై కూడా ఉంటుంది అని అందరూ అనుకున్నారు..కానీ రాజమౌళి తన సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకం తో ఎలాంటి వెనకడుగు వెయ్యకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు..అన్ని అంచనాలు దాటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకొని చరిత్ర సృష్టించింది..ఇది కాసేపు పక్కన పెడితే #RRR సినిమా ఎఫెక్ట్ IPL మీద గట్టిగ పడింది అని ఇప్పుడు సోషల్ మీడియా లో గట్టిగ వినిపిస్తున్న వార్త..కొన్ని నేషనల్ మీడియాలు ఈ సైతం ఈ విషయం పై ప్రత్యేక కథనాలు ఇటీవల ప్రసారం చేసాయి.

ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన IPL మ్యాచ్ కి స్టేడియం లో అతి తక్కువ టికెట్స్ అమ్ముడుపోయాయి అట..మహా రాష్ట్ర జనాలకు IPL అంటే ఒక్క రేంజ్ ఆసక్తి అనే విషయం మన అందరికి తెలిసిందే, ఈ ప్రాంతం లో IPL మ్యాచ్ నిర్వహిస్తున్నారు అని తెలిస్తే జన సందోహం తో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోతాది, అలాంటిది ఈసారి ఇక్కాయి జనాలు IPL మ్యాచ్ పై తక్కువ ఆసక్తి చూపించడం..అదే రోజు #RRR సినిమాకి మహారాష్ట్ర ప్రాంతం లో అద్భుతమైన వసూళ్లు రావడం చూస్తుంటే ఆ సినిమా ప్రభావం IPL మీద పడిందా..లేదా IPL మ్యాచ్ కి క్రేజ్ తగ్గిందా అనే సందేహం లో పడిపోయారు నిర్వాహకులు..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..ఇందుల ఎంతవరుకు నిజం ఉందొ తెలియదు కానీ, మన తెలుగు సినిమా సత్తా గురించి ఇలా పక్క రాష్ట్రాల్లో ఈ విధంగా మాట్లాడుకుంటుంటే మంచి కిక్ ఇస్తుంది అనే చెప్పాలి.

Also Read: KGF 2 Breaks RRR Records: విడుదల కి ముందే RRR రికార్డ్స్ ని బ్రేక్ చేసిన KGF 2
వెయ్యి కోట్ల రూపాయిల ప్రెస్టీజియస్ మార్కుని అందుకున్న #RRR చిత్రం నాల్గవ వారం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..నాల్గవ వారం లో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తోంది..ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తుంది అని , హిందీ లో ఈ సినిమా 270 కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల మార్కుని కచ్చితంగా అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ..ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 300 కోట్ల రూపాయిల షేర్ ని ఫుల్ రన్ లో రాబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ప్రస్తుతం ఈ సినిమా ఇప్పటి వరుకు దాదాపుగా 270 కోట్ల రూపాయిల షేర్ కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫుల్ రన్ లో అన్ని భాషలకు కలిపి 600 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ ..మరి ఈ సినిమా వసూళ్లు ఫైనల్ గా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read: IPL 2022: ఐపీఎల్: యమ రంజుగా అత్యధిక పరుగులు, వికెట్ల పోటీ.. టాప్ లో వీళ్లే
[…] Nidhhi Agerwal: సినీ సెలబ్రిటీలకు కాస్త పేరు రావడంతో మరిన్ని డబ్బులు సంపాదించేందుకు యాడ్స్ లో నటిస్తుంటారు. అయితే కొన్నిసార్లు వారు చేసే యాడ్స్ వల్ల ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. వెనకా ముందు ఆలోచించకుండా డబ్బుల కోసం ఏది పడితే అది చేస్తే చివరకు నెటిజన్ల ట్రోలింగ్ కు గురికావాల్సి వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు. […]