Lava Kusa: తెలుగులో పౌరాణిక సినిమాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ ఏ పౌరాణిక పాత్ర చేసినా అది అద్భుతమే. ఆయన చెప్పే డైలాగులు, పద్యాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఒక పాత్ర ఆయన చేశారంటే.. ఆయన తప్ప ఆ పాత్రకు ఇంకెవ్వరూ సూట్ కాలేరేమో అన్నట్టు జీవిస్తుంటారు. అందం, అభినయంతో ఆయన చేసిన పాత్రలు ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి.

అయితే సీనియర్ ఎన్టీఆర్ చేసిన లవకుశ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ రాముడిగా, సీతగా అంజలీ దేవి నటించారు. ఇందులో లవకుషులుగా ఇద్దరు బాలనటులు నటించారు. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. ఆ రోజుల్లో ఇదో పెద్ద సంచలనం అనే చెప్పుకోవాలి.
ఎందుకంటే ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక రోజులు ఆడిన సినిమాగా అప్పుడు రికార్డులకు ఎక్కింది. అంతకు ముందు ఎన్టీఆర్ నటించిన పాతాల భైరవి సినిమా 245రోజులు ఆడింది. కానీ లవకుశ ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ తెలుగులో ఏకంగా 500రోజులు ఆడింది. ఆ రోజుల్లోనే ఏకంగా రూ.కోటి వరకు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఇదే సినిమా తమిళంలో ఏకంగా 40వారాలు ఆడింది. ఆ తర్వాత హిందీలో రిలీజ్ చేయగా.. అక్కడ కూడా 25 వారాలు ఆడి దుమ్ములేపింది. ఈ సినిమాను అల్లారెడ్డి శంకర్ రెడ్డి నిర్మించారు. తెలుగులో ఇదే తొలి కలర్ సినిమా కావడం విశేషం. ఇందులో వాల్మీకికి నాగయ్య, లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా సత్యానారాయణ, శత్రఘ్ఞడిగా శోభన్ బాబు, లవుడుగా నాగబాబు, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు.
ఈ సినిమా 1963 మార్చి 29న ఈ సినిమా విడులైంది. ఈ సినిమాను చూసేందుకు అప్పట్లోనే ఊర్ల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ జనాలు థియేటర్లకు వెళ్లేవారంట. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో సంచలన విజయం సాధించింది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది ఈ మూవీ.