Bigg Boss OTT Telugu Nominations: బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ గొడవలకు కేరాఫ్ అడ్రస్ అనే ట్యాగ్ లైన్ ఎప్పటి నుంచో ఉంది. అయితే దీన్ని ఈసారి నాన్ స్టాప్ సీజన్ బాగానే కంటిన్యూ చేస్తోంది. కేవలం కాంట్రవర్సీలు, గొడవలు, బూతులు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాల లాంటి మీదనే ఫోకస్ పెడుతూ మరింత రంజుగా ఎపిసోడ్ లను మారుస్తున్నాడు బిగ్ బాస్.

కాగా ఇప్పటికే ఆరు వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇందులో ముమైత్ ఖాన్, సరయు, శ్రీ రాపాక, తేజస్వి, ఆర్జే చైతు, స్రవంతిలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ చాలా రసవత్తరంగా మారాయి. ఈ సారి నామినేషన్స్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. సరొకత్తగా ఇద్దరు జంటగా వచ్చి డిబేట్ పెట్టుకోవాలని, అందులో ఒకరు ఎలిమినేట్ అయిపోయేలా మాట్లాడుకోవాలంటూ చెప్పాడు.

అయితే ఒకరిని నామినేట్ చేసేందుకు ఒప్పుకోకపోతే ఇద్దరినీ నామినేట్ చేస్తామంటూ రూల్ పెట్టాడు. ఇలా వీరు మాట్లాడుతున్నంత సేపు పై నుంచి వాటర్ పడుతుందని కూడా చెప్పాడు. కాగా హమీదా, అనిల్ ను జంటగా పిలవడంతో.. హమీదా కోసం అనిల్ నామినేషన్స్ లోకి వెళ్లిపోయాడు. ఇక మహేశ్ విట్టాను సేఫ్ చేస్తూ మిత్రా శర్మ నామినేట్ అయింది.
ఇక అజయ్ కోసం ఆరియానా గ్లోరీ బలైపోయింది. అయితే నటరాజ్ మాస్టర్, యాంకర్ శివకు డిబేట్ పెట్టడంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఎవ్వరూ తగ్గకపోవడంతో ఇద్దరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఇక వీరి తర్వాత వచ్చిన బిందు మాధవి, అఖిల్ కూడా ఇలాగే తిట్టుకున్నారు. ఎవరూ తగ్గకపోవడంతో వారిద్దరినీ కూడా నామినేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఇక్కడే ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఏంటంటే.. కెప్టెన్ గా ఉన్న అషు రెడ్డికి స్పెషల్ పవర్ ఇచ్చి సేఫ్ గా ఉన్న వారిలో ఒకరిని నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా మహేశ్ విట్టాను నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. కానీ ఆమెకు అఖిల్, అజయ్ అండగా నిలిచారు. ఇలా మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు.

Also Read:Prashanth Neel- Rajamouli: రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్
[…] Also Read: Bigg Boss OTT Telugu Nominations: ఏడోవారంలో 8మంది నామినేట్… […]