https://oktelugu.com/

Manushi chhillar: తొలి సినిమాలోనే స్టార్​ హీరోతో జోడీ కట్టిన మిస్​ వరల్డ్​!

Manushi chhillar: 2017 మిస్ వరల్డ్​లో విన్నర్​గా నిలిచి.. కిరీటాన్ని సొంతం చేసుకున్న అందాల సుందరి మానుషి చిల్లర్​. అయితే, తన అందంతో పాటు, తనలోని నటనను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సినిమాల్లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే బాలీవుడ్​ స్టార్​హీరో సరసన తొలి సినిమా అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్​ పృథ్వీరాజ్​ చౌహాన్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మానుషి హీరోయిన్​గా కనిపించనుంది. తాజాగా, ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 01:17 PM IST
    Follow us on

    Manushi chhillar: 2017 మిస్ వరల్డ్​లో విన్నర్​గా నిలిచి.. కిరీటాన్ని సొంతం చేసుకున్న అందాల సుందరి మానుషి చిల్లర్​. అయితే, తన అందంతో పాటు, తనలోని నటనను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సినిమాల్లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే బాలీవుడ్​ స్టార్​హీరో సరసన తొలి సినిమా అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్​ పృథ్వీరాజ్​ చౌహాన్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మానుషి హీరోయిన్​గా కనిపించనుంది. తాజాగా, ఈ సినిమా టీడర్ విడుదలైంది.

    ప్రముఖ బాలీవుడ్​ నిర్మాణ సంస్థ యశ్​రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తోన్న ఈ సినిమాకు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.  ఈక్రమంలోనే తన మొదటి సినిమాకు సంబంధించిన టీజర్​ను సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది మానుషి.

    ప్రేమలో అతను ఎంతో ధైర్యశాలి. యుద్ధమంటే భయం లేనివాడు. అతనే పృథ్వీరాజ్​ చౌహాన్​.. వచ్చే ఏడాది థియేటర్లలో అతను మీ ముందుకు రాబోతున్నాడు. అంటూ టీజర్​ లింక్​ను షేర్​ చేసింది. ఈ సినిమా తర్వాత ఇదే బ్యానర్​లో రానున్న ద గ్రేట్​ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలోనూ హీరోయిన్​గా ఛాన్స్ కొట్టింది. విక్కీ కౌశల్​ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

    బెల్​బాటమ్​, సూర్యవంశీ వంటి సూపర్​ హిట్​ సినిమాలు అందుకున్న అక్షయ్​.. పృథ్వీరాజ్​ సినిమాలో నటించడం విశేషం సంతరించుకుంది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సంజయ్‌దత్‌, సోనూసూద్‌, సాక్షి తన్వర్‌ తదితర ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.