Rajamouli: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవాల్సిందే. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇక ఈయన దర్శకత్వంలో మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చరణ్ గుర్రపు బండి ఇసుకలో కూరకపోతే తన గుర్రం తనని కాపాడుతుంది.
అయితే ఈ సన్నివేశం మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకొనబడిందని ఒక సందర్భంలో రాజమౌళి తెలియజేశారు. తను చిరంజీవికి పెద్ద అభిమానిని కొదమసింహం సినిమా విడుదలైన తర్వాత థియేటర్ కి వెళ్లి చూసినప్పుడు ఇసుకలో చిరంజీవిని పెట్టినప్పుడు తన గుర్రం తనని బయటకు తీస్తుంది.అయితే ఆ సమయంలో చిరంజీవి తన గుర్రం పట్ల ఎలాంటి సానుభూతి ప్రేమను వ్యక్తపరిచలేదు.ఆ సమయంలో తాను ఎంతో బాధ పడ్డానని ఆ సన్నివేశం తనను ఎంతగానో కలిచి వేసిందని రాజమౌళి తెలిపారు.
ఇదే స్ఫూర్తితో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో రామ్ చరణ్ ను తన గుర్రం కాపాడితే వెంటనే చరణ్ దానిని కౌగిలించుకొని దానిపై ప్రేమను వ్యక్తపరిచారు. అలా కొదమసింహం సినిమాలో చిరంజీవి చేయలేని పనిని మగధీర సినిమాలో రామ్ చరణ్ చేత చేయించానని ఒక సందర్భంలో రాజమౌళి తెలియజేశారు. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.