Mansion House Mallesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలకు కాలం చెల్లింది. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరకెక్కే సినిమాలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండడం విశేషం… ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు చేసిన సినిమాలు ఒకెత్తయితే చిన్న సినిమాలు సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకోవడం మరొకెత్తు…ఇక ప్రస్తుతం తెలంగాణ నేపథ్యం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ప్యూర్ తెలంగాణ నేటివిటిని చూపించినట్టుగా తెలుస్తుంది. సినిమా కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీనాథ్ మాగంటి నటిస్తుండటం విశేషం…
సందీప్ రెడ్డివంగ కి ఈ సినిమాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటూ గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి… మొదట సందీప్ రెడ్డి వంగ దగ్గరికే ఈ కథనైతే తీసుకెళ్లారట. ఆయనకి తెలిసినవాళ్లు తనా దగ్గరికి రావడంతో అది విని ఈ స్టోరీ కి శ్రీనాథ్ మాగంటి అయితే బాగుంటుందని సజెషన్ ఇచ్చాడట.
దాంతో దర్శకుడు సైతం శ్రీనాథ్ మాగంటి వైపు వెళ్లినట్టుగా తెలుస్తుంది… సందీప్ రెడ్డి వంగ కి శ్రీనాథ్ కి ఎప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. శ్రీనాథ్ సైతం ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడనే వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ లో సైతం తన నటన ఆకట్టుకుంది.
మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలపాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది… ఇక ప్రస్తుతం శ్రీనాథ్ మాగంటి ‘ఈ నగరానికి ఏమైంది 2’ లో నటిస్తున్నాడు. ఇంతకుముందు హిట్ సిరీస్ లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మరికొన్ని సినిమాలకు సైతం ప్రస్తుతం అతను సైన్ చేసినట్టుగా తెలుస్తోంది…