Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Ugadi Release Date 2026: ఉగాదికి 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' ఊచకోత.....

Ustaad Bhagat Singh Ugadi Release Date 2026: ఉగాదికి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఊచకోత.. సరికొత్త విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్!

Ustaad Bhagat Singh Ugadi Release Date 2026: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ఈ నెల 26 న విడుదల అవ్వబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నారు. చెప్పిన తేదికంటే వారం రోజుల ముందే ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమ్మయ్యారు. అంటే మార్చి 19 న , ఉగాది రోజున ఈ సినిమా విడుదల కాబోతుంది అన్నమాట . పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ‘ధురంధర్ 2’ తో ఈ చిత్రం పోటీ పడనుంది. వాస్తవానికి ఈ తేదీన యాష్ ‘టాక్సిక్ ‘ చిత్రం విడుదల అవ్వాలి. కానీ ఆ సినిమా వాయిదా పడడంతో మేకర్స్ క్షణం కూడా ఆలోచించకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

అయితే విడుదల తేదీ ప్రకటిస్తే సరిపోదు, దానికి తగ్గ వర్క్ కూడా మేకర్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా పై ఫ్యాన్స్ లోనే సరైన బజ్ క్రియేట్ అవ్వలేదు. విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్స్ లో కేవలం ‘దేఖ్లేంగే సాలా ‘ సాంగ్ ఒక్కటే హిట్ అయ్యింది. రీసెంట్ గా విడుదల చేసిన #AuraOfUstaad సాంగ్ మాత్రం డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మనం 2026 వ సంవత్సరం లో ఉన్నాం, ఇప్పటికీ హీరోకి భజన చేసే పాటలు, సినిమాలు తీస్తే ఎలా ?, ‘ఓజీ ‘ చిత్రాన్ని చూసిన తర్వాత కూడా మార్పు చెందకపోతే ఎలా అని అభిమానులు సైతం డైరెక్టర్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడమే పెద్ద సవాల్ గా మారింది. అంతే కాకుండా ఇంకా ఈ చిత్రం నుండి రెండు పాటలు , టీజర్ , ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వూస్ ఇవన్నీ రావాలి.

సమయం పట్టుమని 14 రోజులు కూడా లేదు. సెన్సార్ ఎప్పుడు చేస్తారు, ఓవర్సీస్ కి ఎప్పుడు కాపీ పంపుతారు ?, అని అభిమానులు అడుగుతున్నాను. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రేపు విడుదల చేసే అవకాశం ఉంది. నేడు మూవీ టీం ఈ టీజర్ కి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కోసం మంగళగిరి కి వెళ్లారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేడు రావొచ్చు. రాబోయే రోజుల్లో ఈ సినిమాపై బజ్ పెరిగేలా మేకర్స్ ఏమి చేయబోతున్నారో చూడాలి. ప్రస్తుతం తమన్ సారథ్యం లో రీ రికార్డింగ్ వర్క్ జరుగుతుంది. ఈ శనివారం నుండి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. మార్చి 10 లోపు ఈ సినిమాకు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular