https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సోనియా ని ‘హగ్గు’ కావలి అంటూ బ్రతిమిలాడిన మణికంఠ..ఇతను బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది ఇందుకా!

విష్ణు ప్రియకు చిరాకు కలిగి సీరియస్ గా చెప్పకుండా, కామెడీ గానే మాట్లాడుతూ ఈయన కంటెంట్ కోసం అమ్మాయిలను మాటికొస్తే హగ్ చేసుకుంటున్నాడు, విడాకుల పేపర్స్ సిద్ధం చేసుకో అంటూ మణికంఠ భార్యకు చెప్తుంది విష్ణు ప్రియ. ఇది ఇలా ఉండగా సోనియా ని అక్కా అని పిలుస్తాడు, ఆమెని ముద్దు పెట్టుకుంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2024 / 08:45 AM IST

    Bigg Boss 8 Telugu(50)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో డ్రామా స్టార్ గా, మైండ్ గేమర్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠ మాత్రమే. హౌస్ లోకి ఇతను అడుగుపెట్టిన క్షణమే ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టేసాడు. ఇతనికి సంబంధించిన AV వీడియో వేసినప్పుడే అత్యధిక శాతం మంది జనాలు ఇతనికి ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత కూడా ఆయన తన ఎమోషనల్ యాంగిల్ ని వాడుకొనే గేమ్ ఆడే ప్రయత్నం చేసాడు. మొదటి వారం మొత్తం అలాగే గడిచింది. ఎలాగో మొదటి వారం గట్టెక్కేసాడు, ఇక రెండవ వారం లో కాస్త తన గేమ్ ని మెరుగుపర్చుకొని నలుగురిలో కలుస్తూ, పర్వాలేదు సాధారణమైన మనిషి లాగానే ప్రవర్తిస్తున్నాడు అని ప్రేక్షకులకు అనిపించింది. అతని గ్రాఫ్ మరింత పెరిగింది. కానీ ఈ వారం మాత్రం మణికంఠ ఓవర్ యాక్షన్ ని జనాలు చూడలేకపోయారు.

    హౌస్ లో ఇతగాడు ఎక్కువగా లేడీ కంటెస్టెంట్స్ తోనే తిరుగుతూ ఉంటాడు. మగ కంటెస్టెంట్స్ మాత్రం ఇతనితో లిమిట్ లో మాట్లాడాలి, లేకపోతే అరిచేస్తాడు. కానీ ఇతను మాత్రం లేడీ కంటెస్టెంట్స్ తో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తాడు. ఈ వారం ఆయన కౌగలించుకోని లేడీ కంటెస్టెంట్ ఎవ్వరూ లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. సందర్భం వచ్చినప్పుడు కౌగిలించుకోవడం లో తప్పు లేదు, కానీ సందర్భం లేకపోయినా ఇతగాడు లేడీ కంటెస్టెంట్స్ ని తెగ దువ్వేస్తున్నాడు. చూసే ఆడియన్స్ కి ఇది చాలా చిరాకుగా అనిపిస్తుంది. యష్మీ తో నామినేషన్స్ లో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత రూమ్ లోపలకు వెళ్లి ఆమెని మూడు సార్లు యష్మీ ఇబ్బంది పడేలా కౌగలించుకుంటాడు. దీనికి ఆమె అసౌకర్యంగా భావించి కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇక ప్రేరణ ని అనేక సందర్భాలలో అవసరం లేకపోయినా కూడా వెళ్లి కౌగలించుకున్నాడు. ఇక నిఖిల్ క్లాన్ సభ్యులు ఉండే రూమ్ లోకి వెళ్లి కిరాక్ సీతని, విష్ణు ప్రియ ని కౌగలించుకుంటాడు.

    విష్ణు ప్రియకు చిరాకు కలిగి సీరియస్ గా చెప్పకుండా, కామెడీ గానే మాట్లాడుతూ ఈయన కంటెంట్ కోసం అమ్మాయిలను మాటికొస్తే హగ్ చేసుకుంటున్నాడు, విడాకుల పేపర్స్ సిద్ధం చేసుకో అంటూ మణికంఠ భార్యకు చెప్తుంది విష్ణు ప్రియ. ఇది ఇలా ఉండగా సోనియా ని అక్కా అని పిలుస్తాడు, ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాస్కు ఆడి అలిసిపోయిన సోనియా ని నాకు హగ్గు కావాలి అని అడుగుతాడు. అప్పుడు సోనియా ‘వామ్మో! మాములు వేషాలు కాదుగా..ఇప్పుడు నేను టాస్కు ఆడాలి, నాకు శక్తి సరిపోదు’ అని అంటుంది. అయినప్పటికీ కూడా మణికంఠ నాకు హగ్గు కావాల్సిందే అని అంటాడు. అప్పుడు సోనియా ఇబ్బంది పడుతూనే సరే రా అంటూ హగ్గు ఇస్తుంది. అవతల అమ్మాయిలు సౌకర్యంగా ఫీల్ అవుతున్నాడా లేదా అనేది కూడా ఇతనికి అవసరం లేదు, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, అమ్మాయిలతో ఇలా ప్రవర్తించే ఈయన తన భార్య ని తెగ మిస్ అయిపోతున్నట్టు మధ్యలో వేసే డ్రామాలు ఏవైతే ఉన్నాయో, అవి వర్ణనాతీతం అనే చెప్పాలి. సోనియా ని హగ్గు అడిగిన వీడియో ని క్రింద అందిస్తున్నాము, ఇది చూసి అసలు మణికంఠ ఉద్దేశ్యం ఏమిటో మీరే చెప్పండి.