https://oktelugu.com/

Bigg Boss Telugu 8: చిన్న దోశ కోసం రాద్ధాంతం చేసిన విష్ణు ప్రియ..మణికంఠ ఓవర్ యాక్షన్ అదుర్స్..చుక్కలు చూపించిన ప్రేరణ!

ప్రేరణ రేషన్ తమ టీం కి బిగ్ బాస్ ఆపేస్తారు అనే హడావుడిలో తన క్లాన్ సభ్యులందరి కోసం వేగంగా దోశలు వెయ్యడం ప్రారంభిస్తుంది. అప్పుడే విష్ణు ప్రియ అక్కడికి వస్తుంది. అంతకు ముందే విష్ణు ప్రియ దోశలు వేసుకోవడం కోసం వంటగదికి వస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 08:39 AM IST

    Bigg Boss 8 Telugu(49)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత బిగ్ బాస్ సీజన్స్ లో గొడవలు ఎక్కువగా టాస్కుల విషయాల్లో జరిగేవి. ఆహరం విషయం లో కూడా అప్పుడప్పుడు జరిగేవి కానీ, పెద్దగా హైలైట్ అయ్యేవి కాదు. కానీ ఈ సీజన్ లో ఆహరం విషయం లోనే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. నేడు మణికంఠ డ్రామా వల్ల హౌస్ లో పెద్ద రచ్చ జరిగింది. యష్మీ నామినేషన్స్ లో చెప్పినట్టే మణికంఠ ఈ హౌస్ లో చాలా డేంజరస్ కంటెస్టెంట్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దోశలు వేసుకునే విషయం లో విష్ణు ప్రియ, ప్రేరణ తప్పు ఏమి లేదు, కానీ మధ్యలో మణికంఠ దూరడం వల్ల చిన్న సమస్య కాస్త పెద్దది అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రేషన్ టాస్కు లో నిఖిల్ టీం గెలుస్తుంది. అప్పటి వరకు హౌస్ మేట్స్ అందరికీ రేషన్ కామన్ గా ఉంటుంది.

    అయితే ప్రేరణ రేషన్ తమ టీం కి బిగ్ బాస్ ఆపేస్తారు అనే హడావుడిలో తన క్లాన్ సభ్యులందరి కోసం వేగంగా దోశలు వెయ్యడం ప్రారంభిస్తుంది. అప్పుడే విష్ణు ప్రియ అక్కడికి వస్తుంది. అంతకు ముందే విష్ణు ప్రియ దోశలు వేసుకోవడం కోసం వంటగదికి వస్తుంది. కానీ మధ్యలో పని పడడం వల్ల 5 నిమిషాల పాటు పక్కకి వెళ్తుంది. ఈ గ్యాప్ లో ప్రేరణ హడావడిగా వచ్చి తన క్లాన్ సభ్యుల కోసం దోశలు కాలుస్తుంది. అంతకు ముందు విష్ణు ప్రియ అక్కడికి వచ్చిన విషయం ప్రేరణకు తెలియదు. తన హడావుడిలో తాను ఉండగా విష్ణు ప్రియ అక్కడికి వస్తుంది. పక్కనే మణికంఠ ఉంటాడు, విష్ణు ప్రియ కి ఒక్క దోశ వెయ్యి అంటాడు. ముందు మన క్లాన్ కి వేసిన తర్వాత వేస్తాను అని అంటుంది ప్రేరణ. అప్పుడు మణికంఠ నేను వేస్తానులే ఆమెకి ఒక్క దోశ దానిదేముంది అంటూ ముందుకు వస్తాడు. ఈ సంఘటనలో ప్రేరణ విష్ణు ప్రియకు దోశలు వెయ్యను అని చెప్పలేదు.

    కానీ మణికంఠ దానిని ప్రేరణ వెయ్యను అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసాడు. అయితే విష్ణు ప్రియ ఆకలితో ఉంది అని చెప్పగానే ప్రేరణ దోశ ఆమె ప్లేట్ లోకి వేస్తుంది. ఆమె మామూలుగానే ప్లేట్ లో వేసింది, కానీ మణికంఠ ఎక్కించిన మాటలు కారణంగా చాలా కఠినంగా జైలులో వేసే వారికి వేసినట్టుగా నా ప్లేట్ లో దోశ వేసింది అని విష్ణు ఫీల్ అయిపోతుంది. తన క్లాన్ సబ్యులకు చెప్పుకొని ఏడ్చేసి పెద్ద రచ్చ చేసేస్తుంమ్ది. చీఫ్ నిఖిల్ ప్రేరణ వద్దకు వెళ్లి అలా చేయడం కరెక్ట్ కాదు కదా అంటాడు. ప్రేరణ నెమ్మదిగానే జరిగిన విషయం మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మధ్యలో నిఖిల్ పెట్రోల్ పొసే ప్రయత్నం చేయగా, అతనికి ప్రేరణ వేరే లెవెల్ లో ఇచ్చి పారేస్తుంది. నీ వల్లే చిన్న సమస్య పెద్దది అయ్యింది, ఇంత పెద్ద గొడవకు కారణం నువ్వే అని చెప్తుంది. ఇక నాటకాల వీరుడు మణికంఠ కాస్త నాటకాలు వేస్తాడు. జరిగిన సంఘటన మొత్తం ఈ క్రింది వీడియో లో ఉంది. ఎవరిది తప్పో మీరే చూసి నిర్ణయించి కామెంట్స్ లో తెలియచేయండి.