Ponniyin Selvan Collections: క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం చారిత్రక కథాంశంతో వచ్చిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ గా జయం రవి, వల్లవ రాయన్ వంద్యదేవన్ గా హీరో కార్తి, నందిని అండ్ మందాకిని దేవిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం, కుండవై పిరట్టియార్ గా త్రిష కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, వర్షాల ప్రభావం అయితే ఈ సినిమా పై బాగానే పడింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Ponniyin Selvan Review: పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ రివ్యూ
నైజాం 0.72 కోట్లు
సీడెడ్ 0.39 కోట్లు
ఉత్తరాంధ్ర 0.42 కోట్లు
ఈస్ట్ 0.23 కోట్లు
వెస్ట్ 0.24 కోట్లు
గుంటూరు 0.22 కోట్లు
కృష్ణా 0.23 కోట్లు
నెల్లూరు 0.21 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ 2.57 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 5.05 కోట్లు వచ్చాయి.

‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. మణిరత్నం సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ గత కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో ఈ మధ్య మార్కెట్ తగ్గింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో రేపటి నుంచి ఈ సినిమాకి కలెక్షన్స్ పెరగనున్నాయి.
Also Read:Singer Mangli Remuneration: సింగర్ మంగ్లీ ఒక్కో పాటకు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?