Ponniyin Selvan Review: మాస్టర్ స్టోరీ టెల్లర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కింది పొన్నియిన్ సెల్వన్. చోళ రాజుల వీరగాథను పొన్నియిన్ సెల్వన్ గా కల్కి కృష్ణమూర్తి నవలగా రాశారు. ఆ నవలకు మణిరత్నం వెండితెర రూపం ఇచ్చారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో స్టార్ క్యాస్ట్ తో పొన్నియిన్ సెల్వన్ రూపొందింది. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో పొన్నియిన్ సెల్వన్ విడుదల కాగా… ఏ మేరకు అంచనాలు అందుకుందో చూద్దాం..

Ponniyin Selvan Review
కథ
పదవ దశాబ్దంలో చోళ రాజ్యన్ని ఆదిత్య కరికాలుడు(విక్రమ్) పాలిస్తూ ఉంటాడు. ఒక రాజ్యం ఉన్నతంగా ఉంటే దాన్ని కబళించడానికి శత్రువులు కుట్రలు పన్నుతూ ఉంటారు. అలాగే ఆదిత్య కరికాలుడి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని శత్రువులు కుట్రలు పన్నుతూ ఉంటారు. తన రాజ్యంపై శత్రువులు పన్నుతున్న పన్నాగాలు తెలుసుకొని రక్షించుకోవాలని ఆదిత్య కరికాలుడు భావిస్తాడు. దాని కోసం కుట్రల గుట్టు తెలుసుకోవడానికి వల్లవరాయన్(కార్తీ)ని పర్యటనకు పంపుతారు. మరి వల్లవరాయన్ తన పర్యటనలో ఏం తెలుసుకున్నాడు? ఆదిత్య కరికాలుడు శత్రువుల కుట్రలను ఛేదించాడా? రాజ్యాన్ని కాపాడుకున్నాడా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
ఓ అద్భుతమైన కథను అంతే అద్భుతంగా వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నం మణిరత్నం చేశారు. పొన్నియిన్ సెల్వన్ విజువల్స్, మణిరత్నం మార్క్ షాట్స్ అబ్బురపరుస్తాయి. ఇక చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ. మణిరత్నం రాసుకున్న సన్నివేశాలు రెహమాన్ సంగీతంతో బాగా ఎలివేట్ అయ్యాయి. కథా బలం సినిమాకున్న మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కల్కి కృష్ణమూర్తి నవలకు పెద్దగా హంగులుదిద్దకుండా ఉన్నది ఉన్నట్లు మణిరత్నం తెరకెక్కించారనిపిస్తుంది.
స్టార్ క్యాస్ట్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయి, త్రిషతో పాటు కీలక పాత్రలు చేసిన నటుల పెర్ఫార్మన్స్ అద్భుతం. కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉన్నతమైన నిర్మాణ విలువలతో రాజీ పడకుండా తెరకెక్కించారు. అయితే ప్రేక్షకులలో ఉత్కంఠ రేపే యుద్ధ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవు. అలాగే ఎమోషనల్ గా మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. నెమ్మదిగా సాగే కథనం కూడా సమస్యగా మారింది. నేటివిటీ ఇబ్బంది పెడుతుంది. లెక్కకు మించి పాత్రలు, వాటి పేర్లు ఇతర భాషల ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తాయి.

Ponniyin Selvan Review
ప్లస్ పాయింట్స్
క్యాస్టింగ్
నటన
కథ
విజువల్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
యాక్షన్ ఎపిసోడ్స్
స్క్రీన్ ప్లే
నేటివిటీ
కన్ఫ్యూజ్ చేసే పాత్రలు
సినిమా చూడాలా? వద్దా?
మణిరత్నం మేకింగ్ లో తన మార్క్ చూపించినప్పటికీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ ఆశించేవారికి నిరాశ ఎదురవుతుంది. అంచనాలు లేకుండా చూస్తే కొంత మేర ఆకట్టుకుంటుంది. అబ్బుర పరిచే విజువల్స్, బలమైన కథ, ఆకట్టుకునే మ్యూజిక్ ఉన్నప్పటికీ నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, నేటివిటీ, లెక్కకు మించిన పాత్రలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. తమిళులు ఎంజాయ్ చేయవచ్చేమో కానీ ఇతర భాషల ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందక పోవచ్చు.
రేటింగ్: 2.75/5