Manchu Vishnu , Rajinikanth
Manchu Vishnu and Rajinikanth : మంచు విష్ణు నటిస్తున్న భారీ చిత్రం కన్నప్ప మరో నెల రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అయితే మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడైన రజినీకాంత్ ఎందుకు నటించలేదు? ఈ ప్రశ్నకు మంచు విష్ణు సమాధానం చెప్పాడు.
మంచు విష్ణు, మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. మంచు విష్ణు మార్కెట్, స్టార్డం రీత్యా కన్నప్ప రిస్క్ తో కూడిన వ్యవహారం. మంచు విష్ణు క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కోటి రూపాయల వసూళ్లు రాబట్టలేకపోయింది. జిన్నా సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ వంటి గ్లామరస్ హీరోయిన్స్ నటించిన సంగతి తెలిసిందే. మరి ఏ ధైర్యంతో మంచు విష్ణు వంద కోట్ల మూవీ చేస్తున్నారనే వాదన ఉంది.
Also Read : వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని నా భార్య చెప్పింది : మంచు విష్ణు
దీనికి సమాధానంగా క్యామియో రోల్స్ ప్రస్తావన తెస్తున్నారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ నటిస్తున్నారు. ఆయనది చిన్న గెస్ట్ రోల్. మోహన్ బాబుతో ప్రభాస్ కి ఉన్న అనుబంధం రీత్యా ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభాస్ కన్నప్ప మూవీలో నటించాడట. ప్రభాస్ పాన్ ఇండియా హీరో. ఆయన ప్లాప్ చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. కాబట్టి ప్రభాస్ కన్నప్ప సినిమాకు అతిపెద్ద బలం. మంచు విష్ణు నమ్మకం కూడా అదే అంటున్నారు. ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు.
ఆయా భాషల్లో ఈ స్టార్ నటులు కన్నప్ప సినిమాకు ప్రచారం తెచ్చి పెడతారనే వాదనలు ఉన్నాయి. చెప్పాలంటే ఇంకా పలువురు పేరున్న నటులు కన్నప్పలో నటిస్తున్నారు. చిన్న పాత్ర నుండి పెద్ద పాత్ర వరకు తెలిసిన నటులతో చేయించారు. అయితే రజినీకాంత్ కన్నప్ప మూవీలో ఎందుకు నటించలేదు అనే సందేహం అందరిలో ఉంది. నిజానికి ప్రభాస్ కి సమానమైన ఇమేజ్ ఉన్న హీరో రజినీకాంత్. ఆయన కూడా ఓ పాత్ర చేసి ఉంటే సినిమాకు ప్లస్ అవుతుంది. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. రజినీకాంత్-మోహన్ బాబు అత్యంత సన్నిహితులు. ఏరా పోరా అనుకునేంత చనువు వాళ్ళ మధ్య ఉంది.
రజినీకాంత్ ఒక్క చిన్న పాత్ర చేస్తే కన్నప్ప కు వచ్చే ప్రచారం వేరే స్థాయిలో ఉంటుంది. మరి మోహన్ బాబు ఎందుకు ఈ ఆలోచన చేయలేదు?. ఈ ప్రశ్నకు మంచు విష్ణు స్వయంగా సమాధానం చెప్పాడు. మోహన్ బాబు అడిగితే రజినీకాంత్ చేస్తారు. కానీ రజినీకాంత్ చేసే పాత్ర కన్నప్ప మూవీలో లేదు. అందుకే ఆయన్ని సంప్రదించలేదు, అన్నారు. మరి మంచు విష్ణు మాటల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు.
Also Read : రజినీకాంత్ ను వైల్డ్ గా చూపించనున్న స్టార్ డైరెక్టర్..?