https://oktelugu.com/

Harish Rao : హరీశ్‌రావు వెళ్లి చెప్పాల్సి వచ్చింది.. కాంగ్రెస్‌ మంత్రుల పరిస్థితిదీ

Harish Rao : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌(Budjet) సమావేశాలు ముగిశాయి. దాదాపు పక్షం రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో 12 బిల్లులు, మూడు తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది.

Written By: , Updated On : March 28, 2025 / 11:23 AM IST
Harish Rao

Harish Rao

Follow us on

Harish Rao : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌(Budjet) సమావేశాలు ముగిశాయి. దాదాపు పక్షం రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో 12 బిల్లులు, మూడు తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. కీలకమైన బడ్జెట్‌తోపాటు బీసీలక 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందింది. అయితే సమావేశాల్లో కొన్ని పరిణామాలు ఆసక్తి రేపాయి.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఇందులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌(BRS) మధ్య గవర్నర్‌ ప్రసంగం నుంచే మాటల యుద్ధం జరిగింది. చివరి రోజుద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా, డీలిమిటేషన్‌(Delimitation)పై చర్చ సందర్భంగా, కాగ్‌ రిపోర్టుపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగానే ప్రసంగాలు సాగాయి. అయితే చివరి రోజు ఆసక్తికర సన్నివేశం చోట్టు చేసుకుంది. కాగ్‌ రిపోర్టుపై హరీశ్‌రావు(Harish Rao) అసెంబ్లీలో కాంగ్రెస్‌ నాయకులైన శ్రీధర్‌ బాబు, భట్టి విక్రమార్కలకు కాగ్‌ (CAG– కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) రిపోర్ట్‌ గురించి వివరించడం కనిపించింది. కాంగ్రెస్‌ నాయకులకు ఆ రిపోర్ట్‌లోని విషయాలు స్పష్టంగా అర్థం కాకపోవడంతో, హరీష్‌ రావు వారి వద్దకు వెళ్లి సులభంగా అర్థమయ్యే విధంగా వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ఇది అసెంబ్లీ చర్చల్లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనగా చెప్పవచ్చు, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకులకు సాంకేతిక విషయాలను విడమరిచి చెప్పే పరిస్థితి ఏర్పడింది.

Also Read : ఇదిగో రాజీనామా.. మీరు రాజీనామా లేఖతో రండి.. రేవంత్‌కి సవాల్ విసిరిన హరీశ్‌!

అనంతరం నిలదీత..
కాగ్‌ రిపోర్టుపై మంత్రులకు వివరించిన హరీశ్‌రావు తర్వాత సభలో ప్రతిపక్షం తరఫున ప్రభుత్వాన్ని నివేదికలోని పలు అంశాల ఆధారంగా నిలదీశారు. అప్పులు, ఖర్చులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రస్తుతం 15 నెలల్లో కాంగ్రెస్‌ చేసిన అప్పులపై వాడీవేడి చర్చ జరిగింది. అప్పుల విషయంలో కాగ్‌ రిపోర్టు ఒకలా.. ప్రభుత్వం ఒకలా చెబుతోందని విపక్ష నేతలు మండిపడ్డారు.

సమాధానం చెప్పిన సీఎం..
చివరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పారు. విమర్శలను తిప్పి కొట్టారు. రూ.1.57 లక్షల కోట్లు అప్పు చేశామని, అయితే ఆ అప్పులు దేనికి చెల్లించామనేది వివరించారు. వడ్డీలు, అసలు కలిపి, వివిధ కార్పొరేషన్ల అప్పులు, సాధారణ అప్పులకే రూ.1.20 లక్షల కోట్లు చెల్లించామని వెల్లడించారు. దీంతో అప్పుల భారం తగ్గుతోందని తెలిపారు. గత పాలకుల ఆర్థిక విధ్వంసానికి ప్రస్తుతం ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు

Also Read : హరీశ్‌ సవాళ్ల వ్యూహం.. రేవంత్‌ బుక్కయ్యాడా?