Homeబిజినెస్Car Maintenance : మీ కారు ఎక్కువ కాలం మన్నాలంటే.. ఈ మెయింటెనెన్స్ టిప్స్ పాటించండి

Car Maintenance : మీ కారు ఎక్కువ కాలం మన్నాలంటే.. ఈ మెయింటెనెన్స్ టిప్స్ పాటించండి

Car Maintenance : ప్రతి ఫ్యామిలీకి వారి కారు ఒక చిన్న ఇల్లు లాంటిది. కుటుంబ సభ్యులు తరచుగా తమకు అవసరమైన వస్తువులను కారులోనే ఉంచుకుంటారు. బూట్లు, దుస్తుల నుంచి మొదలుకుని అనేక వస్తువులు అందులో ఉంటాయి. ఇల్లు ఎలా అయితే మురికిగా మారుతుందో కారు కూడా అలాగే అవుతుంది. కాబట్టి కారు శుభ్రతతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం. కారు మెయింటెనెన్స్ ఒక పెద్ద పనిలా అనిపించినప్పటికీ అది సరిగ్గా చేసినప్పుడే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ప్రతి కారు యజమాని కారు మెయింటెనెన్స్‌పై శ్రద్ధ వహించాలి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మెయింటెనెన్స్ టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.

Also Read : కారు కొనాలని చూస్తున్నారా.. ఈ ఐదు రాష్ట్రాల్లో డెడ్ ఛీప్

1. టైర్లు, బ్యాటరీ మెయింటెన్స్
టైర్లు: కారు టైర్లపై సరైన ట్రెడ్‌ను మెయింటైన్ చేయాలి. అవసరమైనప్పుడు మీకు తగినంత గ్రిప్ ఉండేలా చూసుకోవాలి. మీ వాతావరణానికి అనుకూలమైన క్లైమేట్ రేటింగ్ ఉన్న టైర్‌లను ఎంచుకోండి. MRF, బ్రిడ్జ్‌స్టోన్ వంటి విశ్వసనీయ బ్రాండ్‌లను ఎంచుకోవడం మంచిది. డ్రైవింగ్ పరిస్థితులు, వేడి, రోడ్డు ఉపరితలం, కారు బరువును బట్టి సగటున టైర్లు 40,000 నుంచి 80,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలలో (EVలు) టైర్ల జీవితకాలం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే EVలు ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. వాటి ICE (Internal Combustion Engine) వాహనాల కంటే బరువుగా ఉంటాయి. కారులో ఎల్లప్పుడూ ఒక స్టెపిన్ టైర్ ప్రెషర్ గేజ్, పంక్చర్ కిట్‌ను ఉంచుకోవాలి.

బ్యాటరీ: కారు బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. కారును చల్లని, పొడి ప్రదేశంలో పార్క్ చేయండి. మీరు కారును తరచుగా ఉపయోగించకపోతే బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా ఉండటానికి ప్రతి వారం ఇంజిన్ స్టార్ట్ చేస్తూ ఉండాలి.

2. ఆయిల్, ఫ్లూయిడ్స్:
మీ కారు ఇంజిన్‌లో సరైన ఆయిల్ లెవల్ క్రమం తప్పకుండా చెక్ చేయాలి. కంపెనీ సిఫార్సు చేసిన వ్యవధిలో లేదా కిలోమీటర్లలో ఆయిల్, ఫిల్టర్‌లను మార్చండి. బ్రేక్ ఫ్లూయిడ్, కూలెంట్, విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ స్థాయిలను కూడా క్రమం తప్పకుండా చెక్ చేయాలి. అవసరం అయితే రీఫిల్ చేయాలి.

3. మెకానికల్ మెయింటెన్స్:
ఇది కొంచెం టెక్నికల్ పని అయినప్పటికీ మీ వాహనాన్ని మీరు రోజువారీ ఎలా నడుపుతున్నారనే దానిపై ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, సస్పెన్షన్ లైఫ్ టైం ఆధారపడి ఉంటుంది. స్పీడ్ బంప్‌లను జాగ్రత్తగా దాటడం చాలా ముఖ్యం. ప్రారంభంలోనే అధిక RPMకి చేరుకోవడానికి గేర్లను త్వరత్వరగా మార్చకండి. నెమ్మదిగా వేగం పెంచండి. అలాగే, ఇంజిన్ బ్రేకింగ్‌ను చాలా తరచుగా ఉపయోగించకుండా చూసుకోండి.

ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుతున్నప్పుడు, ప్రారంభంలోనే దూకుడుగా థ్రాటల్ ఇన్‌పుట్‌తో బ్యాటరీని డిశ్చార్జ్ చేయకుండా ఉండడం ముఖ్యం. ICE లేదా EV అయినా, స్టార్ట్ చేసేటప్పుడు బ్యాటరీ, ఇంజిన్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా వేడి ప్రవాహం రావడం వల్ల నష్టం వాటిల్లవచ్చు.

4. ఎయిర్ కండీషనర్ ఉపయోగించాలి
ఎయిర్ కండీషనర్ సిస్టమ్ నిరంతర ఉపయోగం కోసం రూపొందించారు. అలా చేయకపోతే రిఫ్రిజెరాంట్ గ్యాస్ లీక్ కావచ్చు. దానిని ఆఫ్ చేసి, కూలింగ్ కోసం కిటికీలు తెరవడం ఖర్చును తగ్గించే చర్యలా అనిపించవచ్చు, కానీ కిటికీలు తెరవడం వల్ల పెరిగే డ్రాగ్ కారు ఫ్యూయెల్ కెపాసిటీని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు ఫ్యూయెల్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఏ సందర్భంలోనైనా కారు ACని ఉపయోగించడం ACని మళ్లీ గ్యాస్ నింపడం కంటే చౌకైనది.

5. స్పార్క్ ప్లగ్‌లను మార్చండి
ప్లాటినం లేదా ఇరిడియం స్పార్క్ ప్లగ్‌లు కానట్లయితే అవి 100,000 కిమీ వరకు పనిచేస్తాయి. సాధారణ స్పార్క్ ప్లగ్‌లను ప్రతి 20,000 కిమీలకు మార్చాల్సి ఉంటుంది.

6. బ్రేక్ ప్యాడ్‌లు, డిస్క్‌లు, వైపర్ల రీలోకేషన్
ఏ సమయంలో ఏ భాగాన్ని మార్చాలో తెలుసుకోవడం ముఖ్యం. మీ విండ్‌షీల్డ్ వైపర్‌లు చేసే శబ్దం ఆధారంగా వాటిని మార్చాల్సిన సమయం వచ్చిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. బ్రేక్ డిస్క్‌లు, ప్యాడ్ సెటప్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. బ్రేక్ ప్యాడ్‌లు 40,000 కిమీ వరకు పనిచేస్తాయి. ముఖ్యంగా తేలికపాటి డ్రైవింగ్ పరిస్థితులలో ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తాయి. అయితే, బ్రేక్ పెడల్ కదలిక, బ్రేకింగ్ ప్రభావం ఆధారంగా బ్రేక్ ప్యాడ్‌ల సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ అంచనా వేయాలి. బ్రేక్ డిస్క్‌ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అవి చాలా కాలం మన్నుతాయి. ఇవి దాదాపు 70,000 నుంచి 75,000 కిమీ వరకు పనిచేస్తాయి.

ఈ సాధారణ మెయింటెనెన్స్ చిట్కాలను పాటిస్తే మీరు మీ కారు జీవితకాలాన్ని పెంచడమే కాకుండా మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేసుకోవచ్చు.

Also Read : ఇక 5రోజులే.. తక్కువ ధరకు కారు కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version