https://oktelugu.com/

Vishnu Manchu: పవన్ కళ్యాణ్ జోలికి రావొద్దు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ కి మంచు విష్ణు సీరియస్ వార్నింగ్..వైరల్ అవుతున్న ట్వీట్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు స్పందిస్తూ ' ప్రకాష్ రాజ్ గారు..దయచేసి సైలెంట్ గా ఉండండి. తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి చిహ్నం లాంటిది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి, ఈ అంశం పై విచారణ చేపట్టి, మన సనాతన ధర్మం కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 21, 2024 4:03 pm
    Vishnu Manchu(1)

    Vishnu Manchu(1)

    Follow us on

    Vishnu Manchu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ లతో కలిసి ‘మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమం తలపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సభలో చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాం లో జరిగిన అక్రమాల గురించి చెప్తూ ‘గత 5 ఏళ్లలో తిరుమల లడ్డులు తయారు చేయడానికి జంతువుల కొవ్వు ని ఉపయోగించారు. అందుకే నాణ్యత బాగా తగ్గింది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన రోజే NDB రిపోర్ట్స్ బయటకి వచ్చాయి. అందులో తిరుమల లడ్డులు తయారు చేయడానికి జంతువుల కొవ్వుని ఉపయోగించినట్టుగా డాక్యుమెంట్స్ ఇచ్చారు. దీంతో ఈ ఘటన జాతీయ స్థాయిలో సెన్సేషన్ అయ్యింది. పవిత్రమైన తిరుమల లడ్డుని అపవిత్రం చేసినందుకు సీఎం జగన్ ని అడ్డమైన బూతులు తిట్టడం మొదలు పెట్టారు. అతనికి కఠిన శిక్ష విధించాలి అంటూ డిమాండ్ చేసారు.

    ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘జరిగిన సంఘటన కి చాలా బాధ పడుతున్నాము. మా ప్రభుత్వం లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము. ఇలాంటి అనర్ధాలు భవిష్యత్తులో జరగకూడదు అంటే జాతీయ స్థాయిలో సనాతన ధర్మం పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇస్తూ ‘పవన్ కళ్యాణ్ గారు..మీరు ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. ఒకవేళ నిజంగా అలాంటి సంఘటన జరిగి ఉండుంటే మీరు విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించండి. అంతే కానీ ఎందుకు మీరు దీనిని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి పెద్ద రచ్చ చేస్తున్నారు. అసలే మన భారత దేశం లో ఎన్నో మతపరమైన వివాదాలు ఉన్నాయి. అవి సరిపోవు అన్నట్టు కొత్తగా ఈ గొడవ అవసరమా’ అంటూ ట్వీట్ వేసాడు.

    దీనికి నేడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు స్పందిస్తూ ‘ ప్రకాష్ రాజ్ గారు..దయచేసి సైలెంట్ గా ఉండండి. తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి చిహ్నం లాంటిది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి, ఈ అంశం పై విచారణ చేపట్టి, మన సనాతన ధర్మం కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కమ్యూనిస్ట్ ఆలోచనలను ఇలాంటి వాటిపై రుద్దకండి’ అంటూ ట్వీట్ వేసాడు. ఇది ఇప్పుడు సంచలనం గా మారింది. మా ప్రెసిడెంట్ ఎన్నికలకు ఈ ఇద్దరు పోటీపడిన సంగతి తెలిసిందే. పోటీ సమయం లో వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయి విమర్శలు చేసుకున్నారు. ఆ సెగ ఇప్పటికీ తగ్గినట్టు లేదు, అందుకే విష్ణు ఇలా రియాక్ట్ అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.