https://oktelugu.com/

Junior NTR : చంద్రబాబుకు దగ్గరవుతున్న తారక్.. ‘తెర’ వెనుక కథేంటి?

నందమూరి అభిమానులకు, టిడిపి శ్రేణులకు గుడ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతానికి భిన్నంగా స్పందించారు. తాను నటిస్తున్న చిత్రానికి నిబంధనలు సడలించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 21, 2024 / 03:56 PM IST

    Junior NTR-Chndrababu

    Follow us on

    Junior NTR :  చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరవుతున్నారా? అలా చంద్రబాబు ప్లాన్ చేశారా? అందులో భాగంగానే దేవర మూవీ టికెట్ ధరల పెంపు,స్పెషల్ షోలకు ప్రత్యేక అనుమతా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ త్రిల్లర్ దేవర. బాలీవుడ్ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమాలో. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఏపీ ప్రభుత్వం దేవర స్పెషల్ షోలతో పాటు టికెట్ ధరల వెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హీరోజూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

    * ఆ పోస్టులో పేర్కొన్నారు ఇలా
    జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.’ గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. దేవర మూవీ విడుదల నేపథ్యంలో టికెట్ ధరలు, స్పెషల్ షోల ప్రదర్శనకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలుగు సినిమాకు సహకారం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

    * సంబంధాలు అంతంత మాత్రం
    గత కొద్ది రోజులుగా నారా కుటుంబానికి దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. బాబాయ్ బాలకృష్ణ తో సైతం పెద్దగా సంబంధాలు లేవు. లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు, బాలకృష్ణ పక్కన పెట్టారని ప్రచారం సాగింది. వారి మధ్య ఎటువంటి సంబంధాలు లేకపోవడంతో పెద్ద ఎత్తున రూమర్స్ నడిచాయి. అందుకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయంగా ఏనాడూ స్పందించలేదు. చివరకు టిడిపి నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం హాజరు కాలేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సైతం స్పందించలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, మేనత్త భువనేశ్వరిపై అనుచిత కామెంట్స్ వంటి విషయాల్లో పొడిపొడిగానే స్పందించారు.

    * ఇటీవలే పరస్పర అభినందనలు
    అయితే లోలోపల చంద్రబాబుతో మంచి సంబంధాలే జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై దృష్టి పెట్టారు. పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తున్నారు. ఇటువంటి సమయంలో రాజకీయాలపై దృష్టి పెడితే కెరీర్ కు ఇబ్బంది వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు సీఎంగా ఎన్నికైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో తారక్ కు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు దేవర సినిమా పుణ్యమా అని మరోసారి తారక్.. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడం విశేషం. నందమూరి, నారా కుటుంబాల మధ్య అంతరాలు తగ్గుతుండడంతో.. టిడిపి శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.