Manchu Vishnu asked Prabhas to leave movie: కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్ మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. ఇక ‘వర్షం’ సినిమాతో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకున్న ఆయన పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒకడు కావడం విశేషం… ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాడు… ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక హను రాఘవ పూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. దాంతో స్పిరిట్ సినిమా షూటింగ్ పైనే ఆయన పూర్తి ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్పిరిట్ సినిమాని 2027 మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ సందీప్ రెడ్డి వంగ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ దెబ్బతో సందీప్ రెడ్డి వంగ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారుతాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం సందీప్ రెడ్డివంగ ఏమాత్రం తేడాగా తీసిన కూడా సినిమా డిజాస్టర్ గా మారుతుంది అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు…
ఇక ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి డైరెక్టర్ శ్రీను వైట్ల అతనితో ఢీ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. మొదట రవితేజ తో చేయాలనుకున్నప్పటికి ఆ తర్వాత ప్రభాస్ తో చేయాలని శ్రీను వైట్ల అనుకున్నారట. ఇక అనుకోకుండా ఈ కథ విన్న మంచు విష్ణు మాత్రం ఈ మూవీ నేనే చేస్తాను అని చెప్పి ప్రభాస్ దగ్గరికి వెళ్లి నువ్వు వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలను చేస్తున్నావ్ నీకంటూ ఒక మార్కెట్ కూడా క్రియేట్ అయింది. ఈ ఢీ సినిమాని నేను చేస్తాను నాకోసం వదిలేయవయ్యా అని అడిగాడట.
దాంతో ప్రభాస్ సైతం ఇంకేం మాట్లాడకుండా మంచు విష్ణు కోసం ఆ సినిమాను వదిలేశారట. విష్ణు కి ప్రభాస్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇండస్ట్రీకి రాకముందు నుంచే వీళ్ళు కలిసి తిరిగేవారు. దాని వల్లే వాళ్ళిద్దరూ ఇప్పటికి తరచుగా కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మంచు విష్ణు చేసిన కన్నప్ప సినిమాలో సైతం ప్రభాస్ ఒక కీలకపాత్రలో నటించడం విశేషం…