https://oktelugu.com/

Movie Artist Association: “మా” అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన… హర్షం వ్యక్తం చేస్తున్న సభ్యులు

Movie Artist Association: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.  మా అసోసియేషన్ లో ఉమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంచు విష్ణు అన్నారు. నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పురుషులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.  ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. ఈ కమిటీకి పద్మశ్రీ […]

Written By: , Updated On : October 22, 2021 / 07:38 PM IST
Follow us on

Movie Artist Association: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.  మా అసోసియేషన్ లో ఉమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంచు విష్ణు అన్నారు. నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పురుషులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.  ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు.

manchu vishnu announces to create women empowerment and grievance cell in maa

ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీత కృష్ణన్ గౌరవ సలహాదారు గా ఉంటారని విష్ణు స్పష్టం చేశారు. ఈ సెల్ లోని  సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. మా అసోసియేషన్ లో ఇంకా ఎక్కువ మంది మహిళలు  సభ్యులు కావాలన్నది తమ లక్ష్యమని విష్ణు అభిప్రాయపడ్డారు.

ఇందులో భాగంగానే తాము ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంచు విష్ణు వివరించారు.  ఈ నిర్ణయం పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అక్టోబరు 10వ తేదీన జరిగిన మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి అందరికీ  తెలిసిందే. కాగా మరో వైపు మా ఎన్నికలలో రౌడీయిజం జరిగిందంటూ ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఈరోజే ఎన్నిక అధికారికి ఎలక్షన్స్ రోజు మంచు విష్ణు ప్యానల్ సభ్యులతో వైకాపా కార్యకర్త ఉన్న ఫోటో లను లేఖ ద్వారా అందించిన విషయం మీడియా లో వైరల్ గా మారింది.