https://oktelugu.com/

Akkineni Akhil: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ… నుంచి డిలీట్ చేసిన సీన్ విడుదల

Akkineni Akhil: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ – పూజ హెగ్డే జంటగా నటించిన సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఈ చిత్రాన్ని జి ఎ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ సమర్పణలో దసరా సందర్భంగా ఈనెల 15వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. పవన్ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్ అని చెప్పాలి. కాగా దసరా కానుకగా విడుదలైన మిగతా చిత్రాలన్నిటిలో మోస్ట్ […]

Written By: , Updated On : October 22, 2021 / 07:15 PM IST
Follow us on

Akkineni Akhil: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ – పూజ హెగ్డే జంటగా నటించిన సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఈ చిత్రాన్ని జి ఎ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ సమర్పణలో దసరా సందర్భంగా ఈనెల 15వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. పవన్ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్ అని చెప్పాలి.

deleted scene released from most eligible bachelor movie

కాగా దసరా కానుకగా విడుదలైన మిగతా చిత్రాలన్నిటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. అఖిల్ కి మొదటి హిట్ ఇచ్చిన చిత్రంగా కూడా ఈ మూవీని చెప్పవచ్చు. ఇప్పటికి ఈ మూవీ ఫుల్ రన్ తో  సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Most Eligible Bachelor | Pelli Choopulu Deleted Scene | 01 | Akhil Akkineni, Pooja Hegde | Bhaskar

ఈ సినిమాలో డిలీట్ చేసిన పెళ్లిచూపులు సీన్ నీ గీతాఆర్ట్స్  సంస్థ అధికారికంగా విడుదల చేసింది. పెళ్లి చూపుల కోసం వెళ్లి… అమ్మాయి ముందు షర్ట్ విప్పి రచ్చ చేస్తాడు అక్కినేని అఖిల్. ఈ సీన్ లో తన యాక్టింగ్ తో అఖిల్  అదరగొట్టాడు. అయితే ఈ సీన్ ను సినిమాలో మొదట పెట్టాలని అనుకున్న చిత్రబృందం… కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సీన్ కూడా మూవీ లో బాగుండు అని అఖిల్ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ దేలేటెడ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.