Empuran
Empuran : దేశవ్యాప్తంగా ప్రస్తుతం సీక్వెల్స్ కి ఉన్నటువంటి క్రేజ్ సాధారణమైనది కాదు. సినిమా షూటింగ్ ప్రారంభ దశ నుండే సీక్వెల్స్ కి విపరీతంగా క్రేజ్ ఉంటుంది. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2′(Stree 2 Movie), ‘పుష్ప 2’ అందుకు ఉదాహరణలు. ‘పుష్ప 2′(Pushpa 2: The Rule) దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. దాదాపుగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అల్లు అర్జున్ అంటే మంచి క్రేజ్ ఉన్న హీరో కాబట్టి ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని అనుకుందాం. కానీ ఎలాంటి హీరో కూడా లేని, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ‘స్త్రీ 2’ కి కూడా వెయ్యి కోట్లు రావడం అంటే, ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సీక్వెల్స్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో మరో సీక్వెల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read : మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..కారణం ఏమిటంటే!
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) హీరో గా నటించిన ‘లూసిఫర్'(Lucifer Movie) చిత్రం 2019 వ సంవత్సరం లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’ అనే పేరుతో రీమేక్ చేసాడు. కమర్షియల్ గా ఇక్కడ యావరేజ్ రేంజ్ లో ఈ చిత్రం ఆడింది. ‘లూసిఫర్’ చిత్రానికి మలయాళం స్టార్ హీరోలలో ఒకరైన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ మోహన్ లాల్ తో ‘L 2: empuran’ అనే చిత్రం చేసాడు. ఈ నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. ఈ బుకింగ్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
గంటకు అక్షరాలా లక్ష టిక్కెట్లకు పైగా అమ్ముడుపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. గంటకు లక్ష టిక్కెట్లు ఇప్పటి వరకు ‘పుష్ప 2’ కి తప్ప మరో సినిమాకు అమ్ముడుపోలేదు. అలాంటిది ఈ మలయాళం లాంటి చిన్న ఇండస్ట్రీ నుండి విడుదల అవుతున్న ఈ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఒకేసారి అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టడం వల్ల ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు విశ్లేషకులు. బుకింగ్స్ ప్రారంభించిన గంటలోపే ఈ చిత్రం 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మలయాళం సినిమాకు ఇలాంటి ట్రెండ్ ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఇక ఓవర్సీస్ బుకింగ్స్ గురించి చెప్పక్కర్లేదు. మొదటి నుండి మలయాళం సినిమాలకు ఓవర్సీస్ కంచుకోట అందులోనూ మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ సినిమాలను అక్కడ ఎగబడి చూస్తుంటారు, ఊపు చూస్తుంటే మొదటి రోజు ఈ చిత్రం అవలీలగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అనుకుంటున్నారు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూద్దలి.
Also Read : శంకర్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయిన ‘లైకా ప్రొడక్షన్స్!