Manchu Vishnu (2)
Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannapa Movie). కనీసం 10 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ కూడా లేని మంచు విష్ణు, ఏకంగా 200 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారంటే, ఆయన ఎంతటి సాహసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ చిత్రంలో రెబెల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇంత పెద్ద నటులు ఈ చిత్రం లో నటించారంటే, స్క్రిప్ట్ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. అయితే మేకింగ్ వీడియో లో డైరెక్టర్ మేకింగ్ కంటే, మంచు విష్ణు మేకింగ్ ఎక్కువ అయ్యింది. ఆ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు నువ్వు ఈ సినిమాకి డైరెక్టర్ గా కూడా చేసావా వంటి కామెంట్స్ వినిపించాయి.
Also Read: అక్షరాలా 150 కోట్లు..చరిత్ర సృష్టించిన ‘డ్రాగన్’..23 వ రోజు ఎంత వసూళ్లు వచ్చిందో తెలుసా?
ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా వచ్చే నెల 24 న విడుదల అవుతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించి ప్రొమోషన్స్ ని ఇప్పటి నుండే మొదలు పెట్టాడు మంచు విష్ణు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా లో వస్తున్నా ట్రోల్స్ పై స్పందించాడు. మా కన్నప్ప సినిమాపై జనాల్లో 80 శాతం కి పైగా పాజిటివిటీ ఉంది. 15 నుండి 20 శాతం మాత్రమే ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు తెలుగు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ చిత్రం లో రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) పాత్ర 30 నిమిషాల వరకు ఉంటుందని, ఆ క్యారక్టర్ అభిమానులకు మంచి కిక్ ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), మోహన్ లాల్(Mohanlal) గారి సన్నివేశాలు కూడా అద్భుతంగా వచ్చాయని అంటున్నాడు.
ఇదంతా పక్కన పెడితే #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం పై మంచు విష్ణు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘#RRR కి ఆస్కార్ అవార్డు రావడంపై మన ఇండియన్స్ అందరూ ఎంతో గర్వపడ్డారు. కానీ కొంతమంది మాత్రం విమర్శించారు. భారీగా డబ్బులు ఖర్చుపెట్టారు కాబట్టే ఆస్కార్ అవార్డు వచ్చిందని అంటున్నారు. నేను 200 కోట్ల రూపాయిలు ఇస్తాను, ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టండి చూద్దాం. కనీసం ఆస్కార్ ఈవెంట్ జరిగే హాల్ లోకి అడుగుపెట్టగలరా?, నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదు’ అంటూ ఆయన మండిపడ్డాడు. ఇకపోతే కన్నప్ప నుండి ఇప్పటికే రెండే టీజర్లు, రెండు పాటలు వచ్చాయి. కానీ మొదటి పాటకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శివ భక్తి గీతాలలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఆ పాట వచ్చింది. కానీ టీజర్స్ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
Also Read: ‘దిల్ రూబ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..’లైలా’ కంటే ఘోరమైన డిజాస్టర్..పాపం కిరణ్ అబ్బవరం!