Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు…తనదైన రీతిలో చాలా సంవత్సరాల పాటు హీరోగా వెలుగొందిన మోహన్ బాబు ఇప్పుడు సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగానే ఉంటున్నారు. తన కొడుకుల విషయంలో ఆయన చాలావరకు డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా తన చిన్న కొడుకు అయిన మనోజ్ తో అతనికి విభేదాలు రావడం అది పెద్ద వివాదానికి దారి తీయడం వాళ్ళ మధ్య జరిగిన గొడవను యావత్ తెలుగు సినిమా అభిమానులందరూ చూడడం ఇవన్నీ జరిగిపోయాయి. ఇక ఆ ఫ్రస్టేషన్ లో మోహన్ బాబు రిపోర్టర్ మీద దాడి చేయడం కూడా జరిగింది. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు లాంటి ఒక దిగ్గజ నటుడు తన కొడుకులను క్రమశిక్షణతో పెంచాను అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళకి ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా పోయిందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు మంచు మనోజ్ మద్యం తాగి మోహన్ బాబు ఇంటికి రావడం అక్కడ ఎదురైనా వ్యక్తి తనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అతన్ని బూతులు తిట్టడం లాంటివి జరిగిపోయాయి. నిజానికి మనోజ్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా తాగుతున్నాడు అంటూ మోహన్ బాబు గత కొన్ని రోజుల క్రితం ఒక కామెంట్ అయితే చేశాడు. దానివల్లే అతన్ని తాగకుండా ఉండమని మోహన్ బాబు చెప్పాడు.
ఇదంతా తెలుసుకున్న మనోజ్ నేను తాగడం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికి ఇప్పుడు లేకైన వీడియోను చూస్తే మాత్రం ఆయన ఫుల్ గా తగినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
నిజానికి ఆయన అలా తాగడానికి కూడా కారణం మోహన్ బాబు అని మరికొంతమంది అంటున్నారు. ఎందుకు అంటే మనోజ్ కి ఏ మాత్రం ప్రశాంతత లేకుండా మోహన్ బాబు అన్ని ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేసి పెడుతున్నాడు. కాబట్టి మోహన్ బాబు వల్లే అతను ప్రశాంతతను కోరుకోవడానికి మందు తాగుతున్నాడు అంటూ కొంతమంది మనోజ్ ని సమర్థిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా మనోజ్ లాంటి ఒక యంగ్ నటుడు తన కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలతో రోడ్డుకెక్కడం అనేది సరైన విషయం కాదు. మరి ఇప్పటికైనా ఆయన తన కెరియర్ మీద మంచి ఫోకస్ పెడితే నటుడిగా ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…