Baby powder : పౌడర్ లు వాడుతున్నారా? అయినా పౌడర్ వేయకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం సాధ్యమా? మేకప్ కాదు కదా జస్ట్ మేము వాడేది కేవలం పౌడరే అనుకుంటున్నారా? ఇక మీ గురించి కాసేపు పక్కన పెడితే మీ పిల్లలకు పౌడర్ వేస్తున్నారా? అవును కచ్చితంగా అంటారా? అయితే పిల్లలకు స్నానం చేయించడం కామన్. ఆ తర్వాత పిల్లలకు పౌడర్ వేయడం కూడా కామన్. ఇది చాలా మంది పేరెంట్స్ చేసే పని. పౌడర్ రాయడం వల్ల పిల్లలు ఫ్రెష్ గా ఉంటారని నమ్ముతుంటారు తల్లిదండ్రులు. అంతేకాదు… పిల్లల నుంచి మంచి సువాసన వస్తుంది ఈ పౌడర్ ల వల్ల అని అనుకుంటారు. ఇదైతే నిజమే. కానీ, పిల్లలకు అసలు పౌడర్ రాయడం కరెక్టే అంటారా? దీని వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా లేదా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు పొరపాటున కూడా పౌడర్ రాయవద్దు అంటున్నారు నిపుణులు. ఈ పౌడర్ వారికి ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
బేబీ పౌడర్ లో డైలాగ్ అనే ఖనిజ సమ్మేళనం ఉంటుందట. ఇందులో ఉండే ఆస్బెస్టాస్ అనే పదార్థం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే బేబీ పౌడర్ ను బేబీకి పూయవద్దు. లేదంటే ఆ పౌడర్ ను పీల్చినప్పుడు వారి ఊపిరితిత్తుల్లోకి ఈ పౌడర్ వెళ్లి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి, ప్రతి తల్లి తన బిడ్డకు పౌడర్ రాయకుండా ఉండటం మంచిది. లేదంటే ఈ సమయంలో జాగ్రత్త తీసుకోవడం మరింత మంచిది.
పిల్లలకు పౌడర్ రాస్తే మాత్రం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖానికి నేరుగా పౌడర్ రాయకుండా ఆ పౌడర్‌ను ఒక క్లాత్ కి రాసి పిల్లలకు పూయాలి. పౌడర్ కళ్లలోకి, నోటిలోకి, ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే, అనేక ప్రమాదాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. స్నానం చేసిన వెంటనే చర్మానికి పౌడర్ వేయకండి. పూర్తిగా తడి పోయిన తర్వాత అప్పుడు పౌడర్ రాయండి. డైపర్ వేసే ముందు కూడా బిడ్డ ప్రైవేట్ భాగాలకు పౌడర్ వేస్తుంటారు. కానీ అలా చేయకండి. ఇది శిశువు ఆ భాగాలలో చికాకు ,అలెర్జీల వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది. జస్ట్ శిశువు చేతులు, కాళ్ళు ,తొడలపై పౌడర్ రాయండి. ఎక్కువ పౌడర్ కాకుండా తక్కువ పౌడర్ రాయండి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పౌడర్ లు మంచి నాణ్యతను కలిగి ఉన్నాయా? లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ముందుగా వైద్యుడిని సంప్రదించండి, లేకుంటే అది అలెర్జీ వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది.